కామెంటేటర్‌గా డెబ్యూ.. ఎమోషనల్‌ అయిన మాజీ క్రికెటర్‌ | Suresh Raina Gets Emotional His Commentary Debut IPL 2022 Viral | Sakshi
Sakshi News home page

Suresh Raina: కామెంటేటర్‌గా డెబ్యూ.. ఎమోషనల్‌ అయిన మాజీ క్రికెటర్‌

Mar 26 2022 10:38 PM | Updated on Mar 26 2022 10:45 PM

Suresh Raina Gets Emotional His Commentary Debut IPL 2022 Viral - Sakshi

ఐపీఎల్‌ 2022కు ముందు జరిగిన మెగావేలంలో సురేశ్‌రైనాను ఎవరు కొనుగోలు చేయని సంగతి తెలిసిందే. క్రితం సీజన్‌ వరకు ఐపీఎల్‌లో సూపర్‌స్టార్‌గా వెలుగొందిన రైనా అమ్ముడుకాని ప్లేయర్ల జాబితాలో చేరిపోయాడు. దీంతో ఐపీఎల్‌లో ఈసారి రైనా కనిపించడు అని మనం అనుకునేలోపే కామెంటేటర్‌గా ఎంట్రీ ఇచ్చాడు. తాజాగా సీఎస్‌కే, కేకేఆర్‌ మధ్య జరుగుతున్న ఆరంభమ్యాచ్‌కు రైనా కామెంటేటర్‌గా దర్శనమిచ్చాడు.

ఇంతకాలం తాను ఏ జట్టుకైతే ప్రాతినిధ్యం వహించాడో అదే జట్టు సీజన్‌లో తొలి మ్యాచ్‌ ఆడుతుండడంతో ఫ్యాన్స్‌ ఎమోషనల్‌ అయ్యారు. ఇదే విషయాన్ని  ఫ్యాన్స్‌.. ''వి మిస్‌ యూ రైనా'' అంటూ ఎల్లో జెర్సీ రూపంలో ఉన్న రైనా ఫోటోను షేర్‌ చేశారు. విషయం తెలుసుకున్న రైనా స్పందించాడు. ''ఇప్పటికిప్పుడు అవకాశం వస్తే సీఎస్‌కేకు ఆడాలని ఉంది.. అది ఎల్లో జెర్సీ వేసుకొని. అంతేకాదు స్టేడియంలోకి వెళ్లి చెన్నై ఫ్రాంచైజీకి చెందిన గార్డ్స్‌ పెట్టుకోవాలని ఉంది.'' అంటూ తెలిపాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement