సన్‌రైజర్స్‌ను ఢిల్లీ ఆపగలదా! | Sunrisers Hyderabad and Delhi Capitals at the Uppal stadium | Sakshi
Sakshi News home page

సన్‌రైజర్స్‌ను ఢిల్లీ ఆపగలదా!

Apr 21 2026 5:50 AM | Updated on Apr 21 2026 6:11 AM

Sunrisers Hyderabad and Delhi Capitals at the Uppal stadium

నేడు హైదరాబాద్‌లో ఇరు జట్ల మధ్య మ్యాచ్‌

రాత్రి గం.7:30 నుంచి స్టార్‌ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం

సాక్షి, హైదరాబాద్‌: సొంతగడ్డపై గత రెండు మ్యాచ్‌లు గెలిచి జోరు మీదున్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ‘హ్యాట్రిక్‌’ విజయంపై గురి పెట్టింది. ఐపీఎల్‌లో భాగంగా నేడు ఉప్పల్‌ స్టేడియంలో జరిగే లీగ్‌ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో రైజర్స్‌ తలపడుతుంది. మరోవైపు రెండు వరుస పరాజయాల అనంతరం డిఫెండింగ్‌ చాంపియన్‌ రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరును బెంగళూరులోనే ఓడించడంతో ఢిల్లీ టీమ్‌లో కూడా ఆత్మవిశ్వాసం పెరిగింది. 

పాయింట్ల పట్టికలో పెద్ద తేడా లేకుండా దాదాపు సమానంగా ఉన్న ఈ రెండు టీమ్‌లలో ఎవరు పైచేయి సాధిస్తారనేది ఆసక్తికరం. గత రెండు మ్యాచ్‌ల ఫలితాలను బట్టి చూస్తే సన్‌రైజర్స్‌ తుది జట్టులో ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగే అవకాశం ఉంది. అభిõÙక్‌ శర్మ, క్లాసెన్‌ మెరుపు బ్యాటింగ్‌తో పాటు టాప్‌–5లో హెడ్, ఇషాన్‌ కిషన్, నితీశ్‌ రెడ్డి కూడా చెలరేగితే బ్యాటింగ్‌లో తిరుగుండదు. 

బౌలింగ్‌లో యువ ఆటగాళ్లంతా సమష్టింగా రాణిస్తుండటం జట్టు బలం. ప్రఫుల్‌ హింగే, సాకిబ్, శివాంగ్‌లతో పాటు ఇషాన్‌ మలింగ కూడా గత మ్యాచ్‌లో సత్తా చూపించాడు. ఢిల్లీ జట్టులో కేఎల్‌ రాహుల్‌ ఫామ్‌లోకి రావడం సానుకూలాంశం కాగా... స్టబ్స్, డేవిడ్‌ మిల్లర్‌లతో మిడిలార్డర్‌ పటిష్టంగా ఉంది. ముకేశ్, ఎన్‌గిడి, కుల్దీప్‌లతో పాటు అక్షర్‌ పటేల్, నటరాజన్‌ బౌలింగ్‌ భారం మోస్తారు. గత మ్యాచ్‌లో విఫలమైనా... పేసర్‌ ఆకిబ్‌ నబీకి మరో అవకాశం దక్కవచ్చు.

Advertisement
 
Advertisement
Advertisement