IND vs SL: 'అతడు బాస్‌ లా బ్యాటింగ్‌ చేస్తాడు.. భారత్‌ తీసుకున్న నిర్ణయం సరైనదే'

Sunil Gavaskar explains why Mayank Agarwal should be preferred over Shubman Gill - Sakshi

మొహాలీ వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో భారత ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే తొలి టెస్టులో టీమిండియా యువ ఆటగాడు శుభమాన్‌ గిల్‌ బెంచ్‌కే పరిమితమయ్యాడు. కాగా భారత రెగ్యూలర్‌ ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ గాయం కారణంగా జట్టుకు దూరం కావడంతో.. అతడి స్ధానంలో గిల్‌కు స్ధానం దక్కుతుందని అంతా భావించారు. అయితే భారత జట్టు మేనేజేమెంట్‌ ఆనూహ్యంగా మయాంక్‌ ఆగర్వాల్‌ వైపు మొగ్గు చూపింది.

దీంతో రోహిత్‌కు జోడిగా మయాంక్‌  ఆగర్వాల్‌ ఇన్నింగ్స్‌ను ఆరంభించాడు.ఈ మ్యాచ్‌లో ఆగర్వాల్‌ 33 పరుగులు చేసి పర్వాలేదు అనిపించాడు. అయితే భారత తీసుకున్న ఈ నిర్ణయాన్ని కొంతమంది  సమర్థిస్తుంటే.. మరి కొంత మంది తప్పుబడుతున్నారు.  అదే విధంగా శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో భారత జట్టు బ్యాటింగ్‌ ఆర్డర్‌లో కూడా మార్పులు చోటు చేసుకున్నాయి. సీనియర్‌ ఆటగాళ్లు పుజారా, రహానే శ్రీలంకతో సిరీస్‌కు దూరమైన విషయం తెలిసిందే.

ఇక ఈ మ్యాచ్‌లో పుజారా స్ధానంలో హనుమా విహారి బ్యాటింగ్‌కు రాగా.. రహానే స్ధానంలో శ్రేయర్‌ అయ్యర్‌ బ్యాటింగ్‌కు వచ్చాడు. ఈ నేపథ్యంలో  భారత బ్యాటింగ్‌ ఆర్డర్‌పై టీమిండియా మాజీ కెప్టెన్‌ సునీల్‌ గవాస్కర్ ఆసక్తికర వాఖ్యలు చేశాడు. గిల్‌ను కాదు అని మయాంక్‌ను ఆడించాలనే భారత్ నిర్ణయాన్ని గవాస్కర్ సమర్థించాడు."గిల్‌ గత రెండు నెలలుగా ఏ విధమైన  క్రికెట్‌ ఆడలేదు. అతడు కనీసం రంజీ ట్రోఫీలో కూడా పాల్గొనలేదు. అతడు తుది జట్టులోకి రావాలంటే.. కొద్ది రోజులు ప్రాక్టీస్‌ అవసరం. కాగా గిల్‌ మంచి ప్రతిభ ఉన్న ఆటగాడు ఆనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక గిల్‌ను కాదు అని మయాంక్‌ను ఆడించి భారత్‌ మేనేజేమెంట్‌ సరైన నిర్ణయం తీసుకుంది.

మయాంక్ అగర్వాల్ స్వదేశంలో అద్భుతంగా ఆడుతాడు. హోమ్ సిరీస్‌లలో అతడు భారీ స్కోర్లు సాధించాడు. అతను భారత్‌లో ఒక బాస్ లాగా బ్యాటింగ్ చేస్తాడు. అతడు ఓపెనర్‌గా డబుల్‌ సెంచరీ కూడా సాధించాడు. కాబట్టి ఖచ్చితంగా అతడే ఇన్నింగ్స్‌ను ఆరంభించాలి. అదే విధంగా విహారి, శ్రేయస్‌ అయ్యర్‌ బ్యాటింగ్‌ స్ధానాలను కొంత కాలం కొనసాగించాలి" అని గవాస్కర్ పేర్కొన్నాడు. ఇక భారత్‌-శ్రీలంక మధ్య రెండో టెస్టు బెంగళూరు వేదికగా మార్చి 12 ప్రారంభం కానుంది.

చదవండి:  Virat Kohli: రికార్డులన్ని కోహ్లి ఖాతాలోకే.. ఎవరు టచ్‌ చేయలేరు

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top