8 వికెట్ల తేడాతో గెలిచిన దక్షిణాఫ్రికా మహిళల జట్టు
వోల్‌వార్ట్, సునె లుస్ మెరుపులు
షఫాలీ వర్మ అర్ధ సెంచరీ వృథా
డర్బన్: దక్షిణాఫ్రికా పర్యటనలో భారత మహిళల క్రికెట్ జట్టు వరుసగా రెండో పరాజయం మూటగట్టుకుంది. ఐదు టి20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో ఓడిన హర్మన్‌ప్రీత్ సారథ్యంలోని టీమిండియా... ఆదివారం జరిగిన రెండో పోరులో 8 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. దీంతో ప్రస్తుతం హర్మన్ బృందం సిరీస్‌లో 0–2తో వెనుకబడి ఉంది. టి20 ప్రపంచకప్ సన్నాహాల్లో భాగంగా జరుగుతున్న ఈ సిరీస్‌లో టీమిండియా అటు బ్యాటింగ్‌లో, ఇటు బౌలింగ్‌లో ఏమాత్రం ఆకట్టుకోలేకపోతోంది.
మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 147 పరుగులకు ఆలౌటైంది. షఫాలీ వర్మ (38 బంతుల్లో 57; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధశతకం సాధించగా... ఈ మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ అరంగేట్రం చేసిన ఆఫ్‌స్పిన్ ఆల్‌రౌండర్ అనుష్క శర్మ (31 బంతుల్లో 28; 3 ఫోర్లు) ఫర్వాలేదనిపించింది. కెపె్టన్ హర్మన్‌ప్రీత్ కౌర్, వైస్ కెపె్టన్ స్మృతి మంధాన చెరో 12 పరుగులు చేయగా... జెమీమా రోడ్రిగ్స్ (2), దీప్తి శర్మ (1), రిచా ఘోష్ (3) విఫలమయ్యారు.
సఫారీ బౌలర్లలో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ చోల్ ట్రయాన్, టుమి సెఖుఖునె చెరో 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో దక్షిణాఫ్రికా అమ్మాయిలు దంచి కొట్టారు. 17.1 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 148 పరుగులు చేశారు. కెపె్టన్ లౌరా వోల్‌వార్ట్ (34 బంతుల్లో 54; 7 ఫోర్లు, 1 సిక్స్), సునె లుస్ (46 బంతుల్లో 57; 6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధశతకాలతో రాణించారు. ఈ జంట తొలి వికెట్‌కు 106 పరుగులు జోడించడంతో సఫారీ జట్టు సునాయాసంగా గెలుపొందింది. భారత బౌలర్లలో శ్రేయాంక పాటిల్ రెండు వికెట్లు పడగొట్టింది. ఇరు జట్ల మధ్య బుధవారం జొహన్నెస్‌బర్గ్‌లో మూడో టి20 జరగనుంది.
స్కోరు వివరాలు
భారత మహిళల ఇన్నింగ్స్: షఫాలీ (సి) డిక్లెర్క్ (బి) ఎమ్‌లాబా 57; స్మృతి (సి) బాష్ (బి) ట్రయాన్ 12; జెమీమా (సి) సెఖుఖునె (బి) ట్రయాన్ 2; అనుష్క శర్మ (సి) బ్రిట్స్ (బి) ట్రయాన్ 28; హర్మన్‌ప్రీత్ (రనౌట్) 12; దీప్తి శర్మ (సి) జాఫ్తా (బి) సెఖుఖునె 1; రిచా (సి) వోల్‌వార్ట్ (బి) డిక్లెర్క్ 3; అరుంధతి రెడ్డి (రనౌట్) 14; శ్రేయాంక (ఎల్బీ) సెఖుఖునె 0; క్రాంతి (సి) డిక్లెర్క్ (బి) సెఖుఖునె 4; శ్రీచరణి (నాటౌట్) 7; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో ఆలౌట్) 147. వికెట్ల పతనం: 1–22, 2–46, 3–99, 4–109, 5–111, 6–119, 7–127, 8–128, 9–132, 10–147. బౌలింగ్: టుమి సెఖుఖునె 4–0–31–3; ఖాక 4–0–45–0; చోల్ ట్రయాన్ 4–0–22–3; డిక్లెర్క్ 2–0–14–1; ఎమ్‌లాబా 4–0–17–1; డెర్క్‌సెన్ 2–0–17–0.
దక్షిణాఫ్రికా మహిళల ఇన్నింగ్స్: వోల్‌వార్ట్ (సి) అరుంధతి (బి) శ్రేయాంక 54; లుస్ (సి) క్రాంతి (బి) శ్రేయాంక 57; బ్రిట్స్ (నాటౌట్) 20; డెర్క్‌సెన్ (నాటౌట్) 12; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (17.1 ఓవర్లలో 2 వికెట్లకు) 148. వికెట్ల పతనం: 1–106, 2–124. బౌలింగ్: క్రాంతి 2–0–20–0; శ్రేయాంక 4–0–35–2; శ్రీచరణి 4–0–39–0; దీప్తి శర్మ 3–0–23–0; అరుంధతి 4–0–27–0; అనుష్క శర్మ 0.1–0–4–0.


