'స్టేట్ ఐకాన్‌'గా శుభ్‌మన్‌ గిల్‌ | Sakshi
Sakshi News home page

'స్టేట్ ఐకాన్‌'గా శుభ్‌మన్‌ గిల్‌

Published Mon, Feb 19 2024 8:13 PM

Shubman Gill Has Been Designed As Punjab State Icon For Lok Sabha Polls - Sakshi

రానున్న లోక్‌సభ ఎన్నికల కోసం పంజాబ్ 'స్టేట్ ఐకాన్'గా క్రికెటర్ శుభ్‌మన్ గిల్‌ నియమించబడ్డాడు. గిల్‌ను స్టేట్‌ ఐకాన్‌గా నియమిస్తున్నట్లు ఆ రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ సిబిన్ సి ప్రకటించారు. 70 శాతం ఓటింగ్‌ జరిగేలా ఓటర్లలో అవగాహన కలిగించేందుకు గిల్‌  పలు ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటారని సిబిన్‌ తెలిపారు.పంజాబ్‌ పోల్‌ ప్యానెల్‌ ఈసారి 70 శాతానికి మించి ఓటింగ్‌ (ఇస్‌ వార్‌ 70 పార్‌) అనే లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఇందులో భాగంగానే ఓటర్‌ను చైతన్యపరచడం కోసం గిల్‌ లాంటి సెలబ్రిటీల సహకారం తీసుకుంటుంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో పంజాబ్‌లోని 13 స్థానాల్లో 65.96 శాతం ఓటింగ్ నమోదైంది.

కాగా, తాజాగా ఇంగ్లండ్‌తో జరిగిన రాజ్‌కోట్‌ టెస్ట్‌ సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో శుభ్‌మన్‌ గిల్‌ 91 పరుగుల వద్ద ఔటయ్యాడు. దీనికి ముందు టెస్ట్‌ సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో గిల్‌ సెంచరీ చేశాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఘనమైన రికార్డు కలిగిన గిల్‌ టెస్ట్‌ల్లో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోతున్నాడు. ప్రస్తుత ఇంగ్లండ్‌ సిరీస్‌లో గిల్‌ రాణించకపోయుంటే టెస్ట్‌ జట్టు నుంచి ఉద్వాసనకు గురయ్యేవాడు. గిల్‌తో పాటు రోహిత్‌, జడేజా, యశస్వి చెలరేగడంతో రాజ్‌కోట్‌ టెస్ట్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. తద్వారా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-1 ఆధిక్యంలోకి వెళ్లింది.

Advertisement
Advertisement