పోరాడి ఓడిన సహజ  | Sahaja fought and lost | Sakshi
Sakshi News home page

పోరాడి ఓడిన సహజ 

Mar 2 2024 1:29 AM | Updated on Mar 2 2024 1:29 AM

Sahaja fought and lost - Sakshi

అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీఎఫ్‌) మహిళల టోర్నీలో తెలంగాణ క్రీడాకారిణి, భారత రెండో ర్యాంకర్‌ సహజ యామలపల్లి పోరాటం ముగిసింది. గురుగ్రామ్‌లో శుక్రవారం జరిగిన సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో సహజ 5–7, 6–3, 0–6తో టాప్‌ సీడ్‌ దలీలా జకుపోవిచ్‌ (స్లొవేనియా) చేతిలో ఓడిపోయింది. మరోవైపు భారత నంబర్‌వన్‌ అంకిత రైనా సెమీఫైనల్లోకి ప్రవేశించింది. క్వార్టర్‌ ఫైనల్లో అంకిత 4–6, 6–2, 6–4తో జాక్వెలిన్‌ (స్వీడన్‌)పై గెలిచింది.   

Advertisement
 
Advertisement
Advertisement