కొత్త ఫ్రెండ్‌ తిరిగొచ్చాడు: సచిన్‌

Sachin Shares Adorable Pet Cat Video Which Hailed By Fans - Sakshi

ముంబై: కరోనా కోరలు చాస్తుండటంతో చాలా మంది ఇళ్లకే పరిమితమయ్యారు. ముఖ్యంగా సెలబ్రిటీలు రాకరాక వచ్చిన అవకాశం అంటూ ఖాళీ సమయాన్ని ఫ్యామిలీతో గడుపుతున్నారు. కొత్త కొత్త వంటకాలు ప్రయత్నిస్తున్నారు. పెంపుడు జంతువులతో ఆటలాడుతూ సరదా వీడియోలను సోషల్‌ మీడియాలో అభిమానులతో పంచుకుంటున్నారు. క్రికెట్‌ లెజెంట్‌ సచిన్‌ టెండూల్కర్‌ ఇన్‌స్టాలో తాజాగా షేర్‌ చేసిన ఓ వీడియో అభిమానులను తెగ అలరిస్తోంది.

‘నా కొత్త స్నేహితుడు తిరిగొచ్చాడు. క్రితం సారి నుంచి వీడు వడా పావ్‌ మిస్‌ అయినట్టుగా కనిపిస్తోంది’అంటూ సచిన్‌ పెంపుడు పిల్లి వీడియోను షేర్‌ చేశాడు. అంతకుముందు సచిన్‌ వడా పావ్‌ తయారు చేశాడు. తన ఫేవరెట్‌ ఫుడ్‌ ఇదేనంటూ ఇన్‌స్టా పోస్టులో పేర్కొన్నాడు. వడా పావ్‌ కోసం ఓ అతిథి నక్కినక్కి చూస్తోందని పెంపుడు పిల్లిని ఉద్దేశించి ఫోటో కూడా షేర్‌ చేశాడు. ఇప్పుడు అదే పిల్లిని ఉద్దేశించి అభిమానులతో పంచుకున్నాడు. మామిడి పళ్లతో కుల్ఫీ ఎలా తయారు చేయాలో కూడా సచిన్‌ ఇటీవల ఓ పోస్టులో పేర్కొన్నాడు. ఇక సచిన్ ముచ్చటైన పోస్టులతో అభిమానులు సంబరపడిపోతున్నారు. కాగా 1989లో క్రికెట్‌లో అడుగుపెట్టిన సచిన్ టెండూల్కర్‌‌ 2013లో రిటైర్‌ అయిన సంగతి తెలిసిందే!
(చదవండి: షార్జా స్టేడియాన్ని చుట్టేసిన దాదా)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top