Sachin Baby Praises On RR Sanju Samson Over He Leading An IPL Team, Details Inside - Sakshi
Sakshi News home page

IPL 2022: "సంజు కెప్టెన్‌గా అద్భుతంగా రాణిస్తున్నాడు.. అది అంత ఈజీ కాదు"

Apr 28 2022 6:06 PM | Updated on Jun 9 2022 6:26 PM

Sachin Baby Luds on Sanju Samson leading an IPL team - Sakshi

Courtesy: IPL Twitter

రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌ సంజూ శాంసన్‌పై కేరళ వెటరన్‌ ఆటగాడు సచిన్ బేబీ ప్రశంసల వర్షం కురిపించాడు. ఐపీఎల్‌-2022లో శాంసన్‌.. రాజస్థాన్ రాయల్స్‌ను విజయాల బాటలో నడిపిస్తున్నాడు. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 8 మ్యాచ్‌లు ఆడిన రాయల్స్ ఆరు విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. "ఐపీఎల్‌-2022లో సంజు కెప్టెన్‌గా అద్భుతంగా రాణిస్తున్నాడు. అతడు బ్యాట్‌తో కూడా అదరగొడుతున్నాడు.

ముఖ్యంగా ఐపీఎల్‌ లాంటి మెగా టోర్నీలో కెప్టెన్‌గా వ్యవహరించడం అంత తేలికైన పని కాదు. ఎందకుంటే జట్టు విజయం సాధించనప్పడు ప్రశంసలు కురిపించే వాళ్లు చాలా మంది ఉంటారు. అదే ఓటమి చెందితే ప్రశంసించిన వాళ్లే విమర్శలు గుప్పిస్తారు. కెప్టెన్సీ చాలా ఒత్తిడితో కూడుకున్నది. అది ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు. అతడు ఐపీఎల్‌ జట్టుకు కెప్టెన్‌గా ఉండడం కేరళ జట్టుకు మరింత కలిసిస్తోంది" అని సచిన్ బేబీ పేర్కొన్నాడు. ఇక దేశీవాళీ క్రికెట్‌లో కేరళ జట్టుకు శాంసన్‌, సచిన్ బేబీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

చదవండి: IPL 2022: "అతడు అద్భుతమైన బౌలర్.. త్వరలోనే భారత జట్టులోకి వస్తాడు"

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement