
టీమిండియా వన్డే కెప్టెన్‌గా రోహిత్ శర్మ స్ధానంలో శుబ్‌మన్ గిల్‌ను బీసీసీఐ సెలక్షన్ కమిటీ నియమించిన సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియా టూర్‌కు జట్టు ఎంపిక సందర్భంగా ఈ అనుహ్య మార్పు చోటు చేసుకుంది. 2027 ప్రపంచ కప్ కోసం దీర్ఘకాలిక ప్రణాళికలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కకర్ పేర్కొన్నాడు. కాగా హిట్‌మ్యాన్ కెప్టెన్‌గా అద్బుతమైన ట్రాక్ రికార్డు కలిగి ఉన్నాడు.
ఎంఎస్ ధోని తర్వాత మూడు ఐసీసీ వైట్ బాల్ ఈవెంట్స్‌లో భారత జట్టును ఫైనల్‌కు చేర్చిన ఏకైక కెప్టెన్‌గా రోహిత్ నిలిచాడు. భారత్‌కు టీ20 ప్రపంచకప్, ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్స్‌ను రోహిత్ అందించాడు. వన్డే ప్రపంచకప్-2023లో రన్నరప్‌గా టీమిండియాను నిలిపాడు.
అయినప్పటికి రోహిత్‌ను సడన్‌గా కెప్టెన్సీ నుంచి తప్పించడాన్ని చాలా మంది మాజీలు తప్పుబడుతున్నారు. ఈ జాబితాలోకి భారత మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ సబా కరీం చేరాడు. రోహిత్‌ను కెప్టెన్సీ తప్పించడంతో అతడి వన్డే భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారిందని కరీం అభిప్రాయపడ్డాడు.
"రోహిత్‌ను కెప్టెన్సీ నుంచి తప్పిస్తూ సెలక్టర్ల తీసుకున్న నిర్ణయం నన్ను షాక్‌కు గురిచేసింది. ప్రస్తుతం అస్సలు కెప్టెన్సీ మార్పు అవసరమే లేదు. భారత్‌కు రోహిత్ వరుసగా రెండు ట్రోఫీలను అందించాడు. వరల్డ్‌కప్ విన్నింగ్ కెప్టెన్‌కు మీరు ఇచ్చే గౌరవమిదేనా? 2027 ప్రపంచకప్‌కు ఇంకా సమయం ఉంది.
తొందరపడాల్సిన అవసరం ఏమి వచ్చింది. అతడు ఇప్పటికే ఒక ఫార్మాట్‌లో మాత్రమే కొనసాగుతున్నాడు. రోహిత్ శర్మ ఒక నాయకుడిగా అద్బుతమైన జట్టును తాయారు చేశాడు. దాని ఫలితంగానే టీ20 ప్రపంచకప్-2024, ఛాంపియన్స్ ట్రోఫీ-2025ని భారత్ సొంతం చేసుకుంది.
అంతేకాకుండా ప్రస్తుతం టీ20 ఫార్మాట్‌లలో దుమ్ములేపుతున్న భారత జట్టు వెనక కూడా రోహిత్ ఉన్నాడు. అందులో చాలా మంది ఆటగాళ్లు రోహిత్ సారథ్యంలోనే ఆడినవారే. రోహిత్ ఐదు ఆరు నెలలు ఆడకపోతే తన కెప్టెన్సీ, బ్యాటింగ్‌ను మర్చిపోయినట్లు కాదు.
అతడికి వన్డే ఫార్మాట్‌లో ఎలా ఆడాలో తెలుసు, జట్టును విజయ పథంలో ఎలా నడిపించాలో తెలుసు. జట్టులో రోహిత్ రోల్‌పై సెలక్టర్లు క్లారిటీ వుందో లేదో నాకు ఆర్ధం కావడం లేదు. కెప్టెన్సీ నుంచి తప్పించారంటే రోహిత్ వన్డే ఫ్యూచర్‌పై మీకు స్పష్టత లేదు.
2027 ప్రపంచకప్‌లో హిట్ మ్యాన్ ఆడాడని మీరు అనుకుంటుంటే మరి జట్టులో ఎందుకు ఉంచారు. ప్రపంచకప్ ప్రణాళికలలో అతడు లేకపోతే జట్టులో ఎందుకు తీసేయండి? ఒకవేళ అతడు మీ ప్లాన్స్‌లో ఉంటే కెప్టెన్సీ నుంచి తొలిగించాల్సిన అవసరం ఏముంది? ఏదేమైనప్పటికి నా వరకు అయితే సెలక్టర్లు తీసుకున్న నిర్ణయం సరైనది కాదు" తన యూట్యూబ్ ఛానల్‌లో పేర్కొన్నాడు.