బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్ రూబెల్ హెస్సేన్ ఏప్రిల్ 15, 2026న అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ విషయాన్ని ఫేస్‌బుక్ పోస్ట్ ద్వారా వెల్లడించాడు. 36 ఏళ్ల రూబెల్ తన 15 ఏళ్ల కెరీర్‌లో 159 మ్యాచ్‌లు ఆడి 193 వికెట్లు తీశాడు. 27 టెస్ట్‌ల్లో 36 వికెట్లు, 104 వన్డేల్లో 129 వికెట్లు, 28 టీ20ల్లో 28 వికెట్లు తీశాడు.
బంగ్లాదేశ్ తరఫున 2021 ఏప్రిల్‌లో తన చివరి మ్యాచ్ (టీ20) ఆడిన రూబెల్.. ఐదేళ్ల పాటు అవకాశాల కోసం ఎదురుచూసి చివరికి అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. ఇకపై దేశీయ క్రికెట్‌లో కొనసాగుతూ, యువ ఆటగాళ్లకు మార్గదర్శకుడిగా ఉంటానని స్పష్టం చేశాడు. రిటైర్మెంట్ సందేశంలో అభిమానులు, కుటుంబం, మీడియాకు కృతజ్ఞతలు తెలిపాడు.
పరిమిత ఓవర్ల స్పెషలిస్ట్‌గా పేరు గడించిన రూబెల్ రివర్స్ స్వింగింగ్ యార్కర్లు వేయడంలో దిట్ట. 2015 వన్డే వరల్డ్‌కప్‌లో పటిష్టమైన ఇంగ్లండ్‌ను మట్టికరిపించడంలో రూబెల్ కీలకపాత్ర పోషించాడు. ఆ మ్యాచ్‌లో అతను వేసిన 4-53 స్పెల్ బంగ్లాదేశ్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించింది.


