
రాంఛీ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా పట్టు బిగించింది. విజయానికి ఇంకా 152 పరుగుల దూరంలో భారత్ నిలిచింది. 192 పరుగుల లక్ష్యఛేదనలో మూడో రోజు ఆట ముగిసేసమయానికి భారత్ వికెట్ నష్టపోకుండా 40 పరుగులు చేసింది. క్రీజులో రోహిత్ శర్మ(24), యశస్వీ జైశ్వాల్ ఉన్నారు.
అంతకుముందు భారత స్పిన్నర్ల ఉచ్చులో చిక్కుకున్న ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 145 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో అశ్విన్ ఐదు వికెట్లు పడగొట్టగా.. కుల్దీప్ యాదవ్ నాలుగు, జడేజా ఒక్క వికెట్ సాధించారు. ఇక మూడో రోజు ఆట సందర్భంగా ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. భారత మిడిలార్డర్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్‌పై రోహిత్ శర్మ కాస్త సీరియస్ అయ్యాడు.
ఏమి జరిగిందంటే?
ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ 47 ఓవర్ వేసేందుకు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ సిద్దమయ్యాడు. ఈ క్రమంలో కెప్టెన్ రోహిత్ శర్మ ఫీల్డింగ్ మార్పులు చేస్తూ.. సర్ఫరాజ్‌ను సిల్లీ పాయింట్‌లో ఉండమని సూచించాడు. అయితే సర్ఫరాజ్ ఖాన్ హెల్మట్ ధరించకుండానే సిల్లీ పాయింట్‌లో ఫీల్డింగ్ చేయడానికి సిద్దమయ్యాడు.
దీంతో సర్ఫరాజ్‌పై కెప్టెన్ రోహిత్ సీరియస్ అయ్యాడు. 'నువ్వు ఏమైనా హీరో అవ్వాలనుకుంటున్నవా' అని సర్ఫరాజ్‌కు స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. ఈ క్రమంలో కేఎస్ భరత్ హెల్మెట్ తీసుకువచ్చి సర్ఫరాజ్‌కు అందించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కాగా సిల్లీ పాయింట్‌లో హెల్మెట్ లేకుండా ఫీల్డింగ్ చేయడం చాలా ప్రమాద కారం. ఎందుకంటే ఈ ఫీల్డింగ్ పొజిషన్ బ్యాటర్‌కు దగ్గరగా ఉంటుంది. అంతకుముందు ఈ మ్యాచ్‌లో ఇదే స్ధానంలో ఫీల్డింగ్ చేస్తూ సర్ఫరాజ్ అద్భుతమైన క్యాచ్‌ను అందుకున్నాడు.
🔊 Hear this! Rohit does not want Sarfaraz to be a hero?🤔#INDvsENG #IDFCFirstBankTestSeries #BazBowled #JioCinemaSports pic.twitter.com/ZtIsnEZM67
— JioCinema (@JioCinema) February 25, 2024