
ఆఖరి బంతి వరకు నరాలు తెగే ఉత్కంఠత .. చివరి ఓవర్‌లో హై డ్రామా.. దాయాదుల పోరుంటే ఈ మాత్రం ఉండాలి మరి. టీ20 ప్రపంచకప్ సూపర్-12లో భాగంగా మెల్‌బోర్న్ వేదికగా జరిగిన పాకిస్తాన్-భారత్ మ్యాచ్ సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలిపించింది. అఖరి వరకు నువ్వా నేనా అన్నట్లు సాగిన ఈ మ్యాచ్‌లో పాక్‌పై 4 వికెట్ల తేడాతో భారత విజయం సాధించింది.
ఇక టీమిండియా విజయంలో భారత బ్యాటర్ విరాట్ కోహ్లి కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన కోహ్లి.. జట్టుకు చారిత్రాత్మక విజయాన్ని అందించాడు. ఈ మ్యాచ్‌లో 82 పరుగులు చేసిన కోహ్లి.. ఆఖరి వరకు క్రీజులో నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు.
ఇక ఈ అద్భుతమైన విజయం అనంతరం కింగ్ కోహ్లితో పాటుగా భారత ఆటగాళ్లు సెలబ్రేషన్స్‌లో మునిగి తేలిపోయారు. అయితే కోహ్లి గెలుపు సంబురాలను జరపుకుంటూనే కన్నీళ్లు పెట్టుకున్నాడు. అదే సమయంలో మైదానంలోకి వచ్చిన కెప్టెన్ రోహిత్.. కోహ్లిని కౌగిలించుకుని తన భుజంపై ఎత్తుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
That Celebration ♥️🇮🇳🇮🇳#ViratKohli #INDvPAK pic.twitter.com/eUB494PB8C
— A B H I 🇮🇳 (@AbhishekICT) October 23, 2022
చదవండి: భారత్-పాక్ మ్యాచ్.. 'నో బాల్'పై వివాదం.. బౌల్డ్ అయినా రన్స్ ఎలా తీస్తారు?