కొంచెం బాధ‌ప‌డ్డాను.. కానీ రోహిత్ భ‌య్యా మాత్రం చాలా: రింకూ | Sakshi
Sakshi News home page

కొంచెం బాధ‌ప‌డ్డాను.. కానీ రోహిత్ భ‌య్యా మాత్రం చాలా: రింకూ

Published Tue, May 28 2024 12:13 PM

Rinku Singh lauds Rohit Sharmas support, reveals message after T20 WC snub

టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌-2024కు మరో మూడు రోజుల్లో తెర‌లేవ‌నుంది. జూన్ 1 నుంచి అమెరికా, వెస్టిండీస్‌ల వేదిక‌గా ఈ మెగా టోర్నీ ఆరంభం కానుంది. ఈ మెగా ఈవెంట్ కోసం భార‌త జ‌ట్టు ఇప్ప‌టికే అమెరికా గ‌డ్డ‌పై అడుగు పెట్టింది. ఇక ఇది ఇలా ఉండ‌గా.. భార‌త టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ ప్ర‌ధాన‌ జ‌ట్టులో న‌యా ఫినిష‌ర్ రింకూ సింగ్‌కు చోటు ద‌క్క‌క‌పోయిన సంగ‌తి తెలిసిందే.

రింకూకు మెయిన్ స్వ్కాడ్‌లో కాకుండా రిజ‌ర్వ్ జాబితాలో సెల‌క్ట‌ర్లు చోటిచ్చారు. సెల‌క్ట‌ర్లు తీసుకున్న ఈ నిర్ణ‌యంపై పెద్ద ఎత్తున చ‌ర్చ న‌డిచింది. ఈ క్ర‌మంలో వ‌ర‌ల్డ్‌క‌ప్ జ‌ట్టులో చోటుద‌క్క‌క‌పోవ‌డంపై తొలిసారి రింకూ స్పందించాడు. జ‌ట్టు సెల‌క్ష‌న్ త‌ర్వాత భార‌త కెప్టెన్ రోహిత్ శ‌ర్మ త‌న‌తో మాట్లాడాని, ఎంతో స‌పోర్ట్‌గా నిలిచాడ‌ని రింకూ చెప్పుకొచ్చాడు.

"టీ20 వ‌ర‌ల్డ్‌కప్ ప్ర‌ధాన జ‌ట్టులో చోటు ద‌క్క‌క‌పోవ‌డం నాకు కొంచెం బాధ క‌ల్గించంది. ఎందుకంటే మ‌నం బాగా ఆడుతున్న‌ప్ప‌ట‌కి ఎంపిక కాక‌పోతే స‌హ‌జంగా ఎవరైనా బాధపడతారు. అయితే నన్ను ఎంపిక చేయ‌క‌పోవ‌డంలో సెల‌క్ట‌ర్లు త‌ప్పేమి లేదు. 

టీమ్ కాంబినేషన్ కారణంగా న‌న్ను ఎంపిక చేయ‌లేదు. నేను మొదట్లో కొంచెం బాధపడ్డాను. ఆ త‌ర్వాత మ‌న చేతిలో లేని వాటి గురించి ఎక్కువగా ఆలోచించకూడదని నాకు నేనే స‌ర్ది చెప్పుకున్నాను. ఏది జరిగినా స‌రే అది మ‌న‌ మంచికే అనుకున్నాను. 

రోహిత్ భ‌య్యా కూడా నాతో మాట్లాడు. సెల‌క్ష‌న్ గురించి ఎక్కువ‌గా ఆలోచించ‌వ‌ద్దు అని రోహిత్ చెప్పాడు. క‌ష్ట‌ప‌డి ప‌నిచేస్తూ ఉంటూ రెండేళ్ల తర్వాత మళ్లీ ప్రపంచకప్ ఉంటుందని రోహిత్ నాకు స‌పోర్ట్‌గా నిలిచాడని" దైనిక్ జాగరణ్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో రింకూ పేర్కొన్నాడు.

Advertisement
 
Advertisement
 
Advertisement