ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌కు దూరం..

Rahul Tewatia Fails Fitness Test Ahead Of England T20 Series - Sakshi

న్యూఢిల్లీ: ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌కు ఎంపికైన రాజస్థాన్ రాయల్స్ ఆల్‌రౌండర్ రాహుల్ తెవాటియా బీసీసీఐ నిర్వహించిన ఫిట్‌నెస్ టెస్ట్‌లో విఫలమైనట్లు సమాచారం. ఇదే నిజమైతే టీమిండియాకు ప్రాతినిధ్యం వహించాలన్న అతని ఆశలపై నీలినీడలు కమ్ముకున్నట్టే. గతేడాది ఐపీఎల్‌లో విండీస్‌ బౌలర్‌ కాట్రెల్‌పై వరుసగా 5 సిక్సర్లతో విరుచుకుపడ్డ తెవాటియా.. ఒక్కసారిగా లైమ్‌లైట్‌లోకి వచ్చి ఏకంగా టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు. ఇంగ్లండ్‌తో జరుగబోయే 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ కోసం తొలిసారిగా పిలుపునందుకున్నాడు. 

బీసీసీఐ ఫిట్‌నెస్ ప్రమాణాల ప్రకారం జట్టులో చోటు దక్కాలంటే ప్రతి ఆటగాడు యోయో టెస్ట్‌లో 17.1 పాయింట్లు సాధించాలి. లేదా 8.5 నిమిషాల్లో 2 కిలోమీటర్ల పరుగును పూర్తి చేయాలి. కానీ, రాహుల్ తెవాటియా ఈ రెంటిలోనూ విఫలమైనట్లు సమాచారం. తెవాటియాతో పాటు జట్టులోకి ఎంపికైన కోల్‌కతా స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి కూడా ఫిట్‌నెస్ టెస్ట్‌లో విఫలమైనట్లు తెలుస్తోంది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top