Indian Hockey Team-Punjab: హాకీ ఆటగాళ్లకు అరుదైన గౌరవం

Punjab Renames Govt Schools After Hockey Team Players won Medal - Sakshi

చండీగఢ్‌: పంజాబ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టోక్యో ఒలింపిక్స్‌లో భారత పురుషుల హాకీ జట్టు 41 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు  తెరదించిన విషయం తెలిసిందే. టోక్యో ఒలింపిక్స్‌లో జర్మనీని 5-4 తేడాతో ఓడంచి భారత పురుషుల జట్టు కాంస్య పతకం గెలుచుకుంది. కాగా ఒలింపిక్స్‌లో పాల్గొన్న హాకీ జట్టులో  ఎక్కువ మంది  ఆటగాళ్లు పంజాబ్‌ నుంచి ఉన్నారు. టోక్యో ఒలింపిక్స్‌లో వారి విజయానికి గౌరవంగా  భారత పురుషుల హాకీ టీమ్ లో భాగమైన పంజాబ్‌కు చెందిన వివిధ ఆటగాళ్ల పేర్లను పది ప్రభుత్వ పాఠశాలల కు పెట్టాలని  పంజాబ్‌ సర్కార్‌ నిర్ణయించింది. ఈ మేరకు సీఎం అమరీందర్ సింగ్  అంగీకారం తెలిపారని పంజాబ్ విద్యాశాఖా మంత్రి విజయ్ ఇందర్ సింగ్లా స్పష్టం చేశారు.

చదవండి:IPL 2021: పంజాబ్ కింగ్స్‌లోకి ఆసీస్‌ యువ పేసర్‌

మిథాపూర్‌ జలంధర్‌ ప్రభుత్వ సీనియర్‌ సెకండరీ పాఠశాలకు హాకీ జట్టు కెప్టెన్‌ మన్‌ప్రీత్‌ సింగ్‌ పేరును ఖరారు చేసినట్లు చెప్పారు. ఇకపై ఆ పాఠశాల పేరును ఒలింపియన్‌ మన్‌ప్రీత్‌ సింగ్‌ ప్రభుత్వ సీనియర్‌ సెకండరీ స్కూల్‌, మిథాపూర్‌గా మారుస్తామని తెలిపారు. అలాగే అమృత్‌సర్‌లోని తిమ్మోవల్‌ పాఠశాల పేరును వైస్‌ కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ సింగ్‌  పేరుతో మార్చనున్నట్లు పేర్కొన్నారు. అట్టారి పాఠశాల పేరును ఒలింపియన్‌ శంషర్‌ సింగ్‌ ప్రభుత్వ సీనియర్‌ సెకండరీ స్కూల్‌గా.. ఫరీద్‌కోట్‌లోని బాలికల పాఠశాల పేరును ఒలింపియన్‌ రూపిందర్‌పాల్‌ సింగ్‌  ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలగా మారుస్తామన్నారు. ఖుస్రోర్‌పూర్‌ పాఠశాల పేరును ఒలింపియన్‌ హార్దిక్‌ సింగ్‌ పాఠశాల అని, గురుదాస్‌పూర్‌లోని చాహల్‌ కలాన్‌ పాఠశాల పేరును ఒలింపియన్‌ సిమ్‌రంజిత్‌ సింగ్‌ ప్రభుత్వ పాఠశాలగా మార్చనున్నట్లు మంత్రి వెల్లడించారు.

చదవండి:Nithin Maestro Trailer: ‘మాస్ట్రో’ మూవీ ట్రైలర్‌ విడుదల, ఉత్కంఠ రేపుతున్న క్రైం సీన్స్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top