ODI World Cup 2025: పాకిస్తాన్ జ‌ట్టు ప్ర‌క‌ట‌న.. కెప్టెన్ ఎవ‌రంటే? | Pakistan Announce Squad For Womens Cricket World Cup 2025, Check Out Names Inside | Sakshi
Sakshi News home page

ODI World Cup 2025: పాకిస్తాన్ జ‌ట్టు ప్ర‌క‌ట‌న.. కెప్టెన్ ఎవ‌రంటే?

Aug 25 2025 10:35 AM | Updated on Aug 25 2025 11:48 AM

Pakistan announce squad for Womens Cricket World Cup 2025

భార‌త్‌, శ్రీలంక వేదిక‌ల‌గా జ‌ర‌గ‌నున్న మ‌హిళ‌ల వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌-2025 కోసం 15 మంది స‌భ్యుల‌తో కూడిన జ‌ట్టును పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) ప్ర‌క‌టించింది. ఈ జ‌ట్టుకు సీనియ‌ర్ ఆల్‌రౌండ‌ర్ ఫాతిమా సనా నాయకత్వం వ‌హించ‌నుంది. ఐసీసీ టోర్నీల్లో పాక్ జ‌ట్టు కెప్టెన్‌గా ఫాతిమా సనా వ్య‌వ‌హ‌రించ‌డం ఇదే తొలిసారి.

అదే విధంగా నటాలియా పర్వైజ్, రమీన్ షమీమ్, సదాఫ్ షమాస్, సాదియా ఇక్బాల్, షావాల్ జుల్ఫికర్ వంటి యంగ్ ప్లేయ‌ర్లు తొలిసారి వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో పాక్ త‌ర‌పున ఆడ‌నున్నారు. డయానా బేగ్, ఒమైమా సోహైల్ వంటి సీనియ‌ర్ ప్లేయర్లు ఈ జ‌ట్టులో చోటు ద‌క్కించుకున్నారు.

సెప్టెంబర్ 30న ప్రారంభమయ్యే ఈ మెగా టోర్నమెంట్‌లో పాకిస్తాన్ మహిళల జ‌ట్టు తమ అన్ని మ్యాచ్‌ల‌ను కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో ఆడ‌నుంది. అదేవిధంగా ఆక్టోబ‌ర్ 5న కొలంబో వేదిక‌గా భార‌త్‌-పాక్ జ‌ట్లు త‌ల‌ప‌డ‌నున్నాయి.

ఈ మెగా ఈవెంట్ కోసం భార‌త జ‌ట్టును ఇప్ప‌టికే బీసీసీఐ సెల‌క్ష‌న్ క‌మిటీ ప్ర‌క‌టించింది. హర్మాన్ ప్రీత్ కౌర్ సార‌థ్యంలోని భార‌త జ‌ట్టు తమ తొలి మ్యాచ్‌లో సెప్టెంబర్ 30న గౌహ‌తి వేదిక‌గా శ్రీలంక‌తో ఆడ‌నుంది.

మ‌హిళ‌ల వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌కు పాక్ జ‌ట్టు
ఫాతిమా సనా (కెప్టెన్), మునీబా అలీ సిద్ధిఖీ (వైస్ కెప్టెన్), అలియా రియాజ్, డయానా బేగ్, ఎమాన్ ఫాతిమా, నష్రా సుంధు, నటాలియా పర్వైజ్, ఒమైమా సొహైల్, రమీన్ షమీ, సదాఫ్ షమాస్, సాదియా ఇక్బాల్, షావాల్ జుల్ఫికర్, సిద్రా అమిన్ (సిద్రా అమీన్ మరియు) అరూబ్ షా

నాన్-ట్రావెలింగ్ రిజర్వ్‌లు: గుల్ ఫిరోజా, నజిహా అల్వీ, తుబా హసన్, ఉమ్-ఎ-హని మరియు వహీదా అక్తర్

వన్డే వరల్డ్‌కప్‌-2025 టోర్నీకి భారత మహిళా క్రికెట్‌ జట్టు
హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (కెప్టెన్‌), స్మృతి మంధాన (వైస్‌ కెప్టెన్‌), ప్రతీక రావల్, హర్లీన్‌ డియోల్, దీప్తి శర్మ, జెమీమా రోడ్రిగ్స్, యస్తిక భాటియా, అరుంధతి రెడ్డి, క్రాంతి గౌడ్, రిచా ఘోష్, అమన్‌జోత్‌ కౌర్, రాధ యాదవ్, రేణుక ఠాకూర్, శ్రీచరణి, స్నేహ్‌ రాణా. 
స్టాండ్‌బై: సయాలీ సత్‌ఘరే, తేజల్‌ హసబ్నిస్, ప్రేమ రావత్, ప్రియా మిశ్రా, ఉమా ఛెత్రి, మిన్ను మణి
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement