IND Vs SA: 21 టెస్టుల్లో మూడోసారి మాత్రమే.. టీమిండియా ఓపెనర్ల కొత్త చరిత్ర

Only Third 100 Runs Opening Partnership India 21 Tests South Africa Tour - Sakshi

సౌతాఫ్రికా గడ్డపై టీమిండియా ఓపెనర్లు మయాంక్‌ అగర్వాల్‌, కేఎల్‌ రాహుల్‌ కొత్త చరిత్ర సృష్టించారు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో హాఫ్‌ సెంచరీలతో మెరిసిన ఈ ఇద్దరు తొలి వికెట్‌కు 117 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసి ఒక రికార్డు అందుకున్నారు. ప్రొటీస్‌ గడ్డపై ఇప్పటివరకు టీమిండియా 21 టెస్టులు ఆడగా.. రెండుసార్లు మాత్రమే ఓపెనర్లు వంద పరుగుల భాగస్వామ్యం నమోదు చేయగలిగారు.  

చదవండి: SA Vs IND: దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌.. నాలుగేళ్ల తర్వాత అశ్విన్‌ రీ ఎంట్రీ!

తాజాగా కేఎల్‌ రాహుల్‌- మయాంక్‌ జోడి ముచ్చటగా మూడోసారి సెంచరీ భాగస్వామ్య ఫీట్‌ను నమోదు చేశారు. 2006-07 దక్షిణాఫ్రికా పర్యటనలో వసీం జాఫర్‌- దినేశ్‌ కార్తీక్‌ ఓపెనింగ్‌ జోడి(153 పరుగులు) తొలిసారి సెంచరీ భాగస్వామ్యం నమోదు చేశారు. ఆ తర్వాత 2010-11లో సెహ్వాగ్‌- గంభీర్‌ ద్వయం(137 పరుగులు) రెండోసారి సెంచరీ భాగస్వామ్యం నమోదు చేశారు. 

చదవండి: Cheteswar Pujara: అప్పుడు 'గోల్డెన్‌' రనౌట్‌.. ఇప్పుడు 'గోల్డెన్‌' డక్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top