
Photo Credit : IPL Website
IPL 2023 CSK vs MI: ఐపీఎల్-2023 సీజన్‌కు ముందు జరిగిన మినీవేలంలో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్‌ను పోటీ పడి మరి రూ.17.5 కోట్లకు ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది. ఆల్‌రౌండర్‌గా సేవలు అందిస్తాడని గ్రీన్‌పై ముంబై ఇంత మొత్తాన్ని వెచ్చించింది. అయితే ఇంత భారీ ధర దక్కించుకున్న గ్రీన్.. ఈ ఏడాది ఐపీఎల్‌లో మాత్రం దారుణ ప్రదర్శన కనబరుస్తున్నాడు.
ఈ మెగా ఈవెంట్‌లో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో గ్రీన్ దారుణంగా విఫలయ్యాడు. బ్యాటింగ్, బౌలింగ్ రెండు విభాగాల్లోనూ గ్రీన్ రాణించలేకపోతున్నాడు. ఆర్సీబీతో జరిగిన తొలి మ్యాచ్‌లో కేవలం 5 పరుగులు చేసి ఒక్క వికెట్ సాధించిన గ్రీన్.. అనంతరం శనివారం సీఎస్‌కేతో జరిగిన మ్యాచ్‌లో కేవలం 12 పరుగులు మాత్రమే చేశాడు.
బౌలింగ్‌లో అయితే వికెట్ ఏమి సాధించకుండా 20 పరుగులిచ్చాడు. ఇక రూ.17.5 కోట్ల భారీ మెత్తం తీసుకుని దారుణంగా విఫలమవుతున్న గ్రీన్‌ను నెటిజన్లు దారుణంగా ట్రోలు చేస్తున్నారు. ఈ మాత్రం ఆటకేనా ఇంత తీసుకున్నావు అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.
మరి కొంత మంది ముంబై మెనెజ్‌మెంట్‌ను తప్పుబడుతున్నారు. ఒకట్రెండు ఇన్నింగ్స్‌లు బాగా ఆడినంతమాత్రాన అంత మొత్తం ఇవ్వాల్సిన అవసరములేదని కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు ముంబై ఈ సారి కూడా లీగ్ దశలోనే ఇంటిముఖం పడుతుందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
చదవండి: IPL 2023 CSK vs MI: ఘోర ఓటమి.. ముఖం దాచుకున్న రోహిత్ శర్మ! ఫోటో వైరల్