నీరజ్‌కు నాలుగో స్థానం | Neeraj finishes fourth at Doha Diamond League | Sakshi
Sakshi News home page

నీరజ్‌కు నాలుగో స్థానం

Jun 20 2026 3:58 AM | Updated on Jun 20 2026 3:58 AM

Neeraj finishes fourth at Doha Diamond League

దోహా: సుదీర్ఘ విరామం అనంతరం మైదానంలో అడుగుపెట్టిన భారత స్టార్‌ జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా... స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేకపోయాడు. ప్రతిష్టాత్మక దోహా డైమండ్‌ లీగ్‌లో జావెలిన్‌ను అత్యుత్తమంగా 85.69 మీటర్ల దూరం విసిరి నాలుగో స్థానంలో నిలిచాడు. శ్రీలంక ఆటగాడు రుమేశ్‌ పతిరగే 88.68 మీటర్లు అగ్రస్థానం దక్కించుకోగా... పీటర్స్‌ అండర్సన్‌ (86.38 మీటర్లు; గ్రనేడా) రెండో ‘ప్లేస్‌’ దక్కించుకున్నాడు. 

గతేడాది వరల్డ్‌ చాంపియన్‌షిప్‌ అనంతరం మైదానానికి దూరమైన భారత స్టార్‌... దాదాపు తొమ్మిది నెలల తర్వాత శుక్రవారమే కొత్త సీజన్‌ను ప్రారంభించాడు. తొలి ప్రయత్నంలో ఫౌల్‌ చేసిన నీరజ్‌... రెండో ప్రయత్నంలో జావెలిన్‌ను 82.77 మీటర్ల దూరం విసిరాడు. మూడో ప్రయత్నంలో 85.69 మీటర్లు, నాలుగో ప్రయత్నంలో 83.45 మీటర్లు విసిరగా... ఐదో ప్రయత్నంలో మరోసారి ఫౌల్‌ చేశాడు. అయితే ఈ క్రమంలో నీరజ్‌ కామన్వెల్త్‌ క్రీడల అర్హత మార్క్‌ (82.61 మీటర్లు)ను అధిగమించాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement