దోహా డైమండ్‌ లీగ్‌కు నీరజ్‌ చోప్రా దూరం! | Neeraj Chopra Pulls-out-of-Doha Diamond League Due-to-Back injury | Sakshi
Sakshi News home page

దోహా డైమండ్‌ లీగ్‌కు నీరజ్‌ చోప్రా దూరం!

Jun 12 2026 8:59 PM | Updated on Jun 12 2026 9:32 PM

Neeraj Chopra Pulls-out-of-Doha Diamond League Due-to-Back injury

పారిస్ ఒలింపిక్స్‌ విజేత‌ నీర‌జ్ చోప్రా మ‌రో మెగా ఈవెంట్‌కు దూర‌మ‌య్యాడు. గాయంతో బాధ ప‌డుతున్న చోప్రా ప్ర‌తిష్ఠాత్మ‌క దోహా డైమండ్ లీగ్ నుంచి వైదొలిగాడు. వెన్ను గాయం నుంచి కోలుకుంటున్న అత‌డు జూన్ 19 నుంచి మొద‌ల‌య్యే మెగా ఈవెంట్‌లో పాల్గొన‌డం లేదు. 

దాంతో, నిరుడు ఇదే లీగ్‌లో 90 మీట‌ర్ల దూరం ఈటెను విసిరిన భార‌త స్టార్ జావెలిన్ త్రోయ‌ర్ ఆట‌ను అభిమానులు మిస్ కానున్నారు. ఈ మ‌ధ్య కాలంలో గాయాల కార‌ణంగా ప‌లు టోర్నీలకు డుమ్మా కొడుతున్న నీర‌జ్ చోప్రా ఈటెను ప‌ట్టేందుకు మ‌రింత స‌మ‌యం ప‌ట్ట‌నుంది. ప్ర‌స్తుతం నీర‌జ్ వెన్నెముక గాయం నుంచి కోలుకుంటుండ‌డ‌మే అందుకు కార‌ణం. 

ఫ‌లితంగా జూన్ 19 నుంచి జ‌రిగే దోహా డైమండ్ లీగ్‌కు చోప్రా దూర‌మ‌య్యాడు. త్వ‌ర‌లో జ‌రుగ‌బోయే కామ‌న్‌వెల్త్ గేమ్స్, ఆసియా క్రీడ‌లే లక్ష్యంగా పెట్టుకున్న నీర‌జ్.. సైకోథెర‌పిస్ట్ ఇషాన్ మ‌ర్వాహ, కోచ్ జై చౌద‌రీ సాయంతో స్విట్జ‌ర్‌లాండ్‌లోని బీయెన్నేలో 47 రోజుల శిక్ష‌ణ తీసుకుంటున్నాడు.

చదవండి: జ‌స్పాల్ రాణా మృతి వెనుక అసలు కారణమిదే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement