Reports Says Pakistan's Mohammad Amir Likely To Return to International Cricket - Sakshi
Sakshi News home page

పాకిస్తాన్‌కు గుడ్‌ న్యూస్‌.. స్టార్‌ బౌలర్‌ రీ ఎంట్రీ!

Apr 11 2022 6:41 PM | Updated on Apr 11 2022 7:11 PM

 Mohammad Amir likely to return to international cricket Says Reports - Sakshi

అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి తప్పుకున్న పాకిస్తాన్‌ స్టార్‌ పేసర్‌ మహ్మద్ అమీర్.. మళ్లీ జాతీయ జట్టు తరుపున ఆడేందుకు సిద్దమవుతున్నట్లు సమాచారం. కాగా పాకిస్తాన్‌ క్రికెట్‌  బోర్డుతో విభేదాల కారణంగా 2020లో అంతర్జాతీయ క్రికెట్‌కు అమీర్ రిటైర్మెంట్‌ ప్రకటించాడు. ఇక ప్రస్తుత పాకిస్థాన్ క్రికెట్ బోర్డు  చైర్మన్ రమీజ్ రాజా తన పదవికి రాజీనామా చేసిన తర్వాత..  అమీర్ తిరిగి జాతీయ జట్టులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

కాగా పీసీబీ కొత్త  చైర్మన్‌గా రమీజ్ రాజా స్థానంలో నజం సేథీ రావచ్చని వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇక అవిశ్వాస తీర్మానంలో ప్రధాన మంత్రి ఇమ్రాన్‌ఖాన్‌ ఓడిపోవడంతో తన పదవిని కోల్పోయారు. దీంతో ఇమ్రాన్‌ఖాన్‌ స్థానంలో నూతన ప్రధానిగా షెహబాజ్‌ షరీఫ్‌ ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌ క్రికెట్‌లో కూడా కీలక మార్పులు చోటు చేసుకోనున్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. ఇక అమీర్ 36 టెస్టులు, 61 వన్డేలు, 50 టీ20ల్లో  పాకిస్తాన్‌ తరపున ప్రాతినిధ్యం వహించాడు.

చదవండి: IPL 2022: అంపైర్‌పై కోపంతో ఊగిపోయిన చాహల్‌.. వీడియో వైరల్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement