మళ్లీ పాకిస్తాన్‌ తరపున ఆడాలనుకుంటున్నాను: మహ్మద్‌ అమీర్‌

Mohammad Amir hints at potential return to national team - Sakshi

అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి తప్పుకున్న పాకిస్తాన్‌ స్టార్‌ పేసర్‌ మహ్మద్ అమీర్.. మళ్లీ జాతీయ జట్టు తరపున రీ ఎంట్రీ ఇవ్వడం దాదాపు ఖాయమైంది. పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు  ఛైర్మన్ రమీజ్ రాజాతో విభేదాల కారణంగా 2020లో అంతర్జాతీయ క్రికెట్‌కు అమీర్ రిటైర్మెంట్‌ ప్రకటించాడు. అయితే ఇప్పుడు పీసీబీ కొత్త  చైర్మన్‌గా రమీజ్ రాజా స్థానంలో నజం సేథీ బాధ్యతలు చేపట్టడంతో అమీర్‌ జట్టులోకి వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నాడు.

కాగా సేథీ కూడా అమీర్‌ను మళ్లీ తమ జట్టులోకి తీసుకురావాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో లాహోర్‌లోని నేషనల్ హై పెర్ఫార్మెన్స్ సెంటర్‌లో శిక్షణ పొందేందుకు అమీర్‌ పీసీబీ అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో  అమీర్‌ విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ.. మళ్లీ పాకిస్తాన్‌ జెర్సీ ధరించేందుకు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నట్లు అమీర్‌ తెలిపాడు.

ఈ మేరకు.. "అల్లా దయ వుంటే మళ్లీ నేను పాకిస్తాన్‌ తరపున ఆడతాను. నేను పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌లో అద్భుతంగా రాణించి మళ్లీ జాతీయ జట్టులోకి రావడమే నా లక్ష్యం" అని అమీర్‌ పేర్కొన్నాడు.  ఇక అమీర్ 36 టెస్టులు, 61 వన్డేలు, 50 టీ20ల్లో  పాకిస్తాన్‌ తరపున ప్రాతినిధ్యం వహించాడు.
చదవండి: Shahid Afridi: పీసీబీ చీఫ్‌ సెలెక్టర్‌గా అఫ్రిది మంగమ్మ శపథం

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top