ఆరోజు బస్సులో అతని పక్కనే కూర్చున్నా.. అందుకే

Mike Hussey Reveals How He Got Covid 19 Sitting Next To L Balaji - Sakshi

సిడ్నీ: కరోనా మహమ్మరి సెగతో ఐపీఎల్‌ 14వ సీజన్‌ను బీసీసీఐ రద్దు చేసిన సంగతి తెలిసిందే. కేకేఆర్‌ ఆటగాళ్లు వరుణ్‌ చక్రవర్తి, సందీప్‌ వారియర్‌లతో పాటు ఎస్‌ఆర్‌హెచ్‌ ఆటగాడు వృద్ధిమాన్‌ సాహా, ఢిల్లీ క్యాపిటల్స్‌ ఆటగాడు అమిత్‌ మిశ్రాలు కరోనా బారీన పడ్డారు. ఇటు సీఎస్‌కే బౌలింగ్‌ కోచ్‌ లక్ష్మీపతి బాలాజీకి కూడా కరోనా సోకడంతో  లీగ్‌ను రద్దు చేయక తప్పలేదు.  అలా ఐపీఎల్‌ 14వ సీజన్‌లో కరోనా బారిన పడ్డ వారిలో సీఎస్‌కే బ్యాటింగ్‌ కోచ్‌ మైక్‌ హస్సీ కూడా ఉన్నాడు. హస్సీకి రెండు సార్లు కరోనా పాజిటివ్‌ రావడంతో బీసీసీఐ ఏర్పాటు చేసిన క్వారంటైన్‌లో ఉండి కోలుకున్న అతను ఇటీవలే మాల్దీవ్స్‌ నుంచి తన సొంత దేశం ఆస్ట్రేలియాకు చేరుకున్నాడు.

తాజాగా హస్సీ తన ఆరోగ్య పరిస్థితిపై ఫాక్స్‌ స్పోర్ట్స్‌కు ఇంటర్య్వూ ఇచ్చాడు. ' కరోనా నుంచి కోలుకున్న ఇంకా శరీరం కాస్త వీక్‌గానే ఉంది. మళ్లీ నార్మల్‌ కండీషన్‌కు రావడానికి నాకు కొంచెం టైమ్‌ పట్టొచ్చు. కరోనా సోకిన 10 రోజుల తర్వాత మళ్లీ టెస్టు చేయించుకుంటే పాజిటివ్‌ రావడంతో కాస్తంత భయపడ్డా.. కానీ బీసీసీఐ నాకు ధైర్యం చెప్పింది. బహుశా నాకు బాలాజీ ద్వారానే కరోనా వచ్చి ఉండొచ్చు. ఆరోజు బస్సులో తాను బాలాజీ పక్కనే కూర్చున్నా.. అప్పటికే బాలాజీకి కరోనా లక్షణాలు ఉన్నాయి. కానీ ఆ విషయం మా ఇద్దరికి తెలియదు. బాలాజీతో కబుర్లు చెబుతూ కాస్త సరదాగా గడిపాను... బహుశా అప్పుడు ట్రాన్స్‌మిషన్‌ ద్వారా కరోనా సోకి ఉండొచ్చు. ఏదైతేనేం కరోనాను జయించి నా దేశానికి చేరుకున్నా. నేను సిడ్నీ ఎయిర్‌పోర్టులో దిగగానే నా కుటుంబసభ్యులు, పోలీసులు, మెడికల్‌ సిబ్బంది నన్ను రిసీవ్‌ చేసుకున్న విధానం బాగా నచ్చింది. అంటూ చెప్పుకొచ్చాడు. 

2004 నుంచి 2013 వరకు ఆసీస్‌కు ప్రాతినిధ్యం వహించిన మైక్‌ హస్సీ 79 టెస్టుల్లో 6,235 పరుగులు; 185 వన్డేల్లో 5,442 పరుగులు; 38 టీ20ల్లో 721 పరుగులు సాధించాడు. ఇక ఐపీఎల్‌లో సీఎస్‌కేకు ప్రాతినిధ్యం వహించిన హస్సీ 59 మ్యాచ్‌లాడి 1977 పరుగులు చేశాడు.
చదవండి: మైకెల్‌ హస్సీకి మళ్లీ కరోనా పాజిటివ్‌

AUS VS ENG: యాషెస్‌ సిరీస్‌ షెడ్యూల్‌ విడుదల

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

19-05-2021
May 19, 2021, 14:52 IST
సాక్షి, న్యూఢిల్లీ: కోవిడ్‌–19 నివారణకు జరుగుతున్న ప్రయత్నాలలో రైల్వే పూర్తిస్థాయిలో సహకారం అందిస్తోంది. అవసరమైన ప్రాంతాలకు అత్యంత వేగంగా ఆక్సిజన్‌...
19-05-2021
May 19, 2021, 14:15 IST
చండీగ‌ఢ్‌: కరోనా వైరస్‌ బారినపడి ఎంతోమంది అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నారు. మయదారి మహమ్మారి ఎన్నో కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తోంది. తాజాగా కరోనాతో...
19-05-2021
May 19, 2021, 10:49 IST
లక్నో: మహమ్మారి కరోనా వైరస్‌కు ఉత్తరప్రదేశ్‌కు చెందిన మరో మంత్రి బలయ్యాడు. కరోనాతో ఆస్పత్రిలో పోరాడుతూ చివరకు కన్నుమూశాడు. విజయ్‌...
19-05-2021
May 19, 2021, 10:39 IST
న్యూఢిల్లీ: కోవిడ్‌ టీకాలను అందరికీ అందుబాటులోకి తెచ్చి ఉంటే దేశం ప్రస్తుతం ఇలాంటి బాధాకరమైన పరిస్థితులను చవి చూడాల్సి వచ్చేది...
19-05-2021
May 19, 2021, 08:25 IST
వాషింగ్టన్‌: కరోనా మహమ్మారి దేశాన్ని కుదిపేస్తున్న వేళ అగ్రరాజ్యం అమెరికా భారత్‌కు అండగా నిలుస్తామని పునరుద్ఘాటించింది. భారత్‌కు అందిస్తున్న తాము...
19-05-2021
May 19, 2021, 05:37 IST
ఉలవపాడు: ప్రజలు బాగుంటేనే ఊరు బాగుంటుంది. కరోనా వేళ ప్రజల క్షేమమే లక్ష్యంగా.. ఆ గ్రామ పెద్దలు కష్టమైనా కఠిన...
19-05-2021
May 19, 2021, 04:48 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇప్పటివరకు 1.48 కోట్ల మందికిపైగా వ్యాక్సిన్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారు. మరింతమంది దరఖాస్తు చేసుకునేందుకు కోవిన్‌...
19-05-2021
May 19, 2021, 03:41 IST
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ప్రస్తుతానికి 3 లక్షల కోవాగ్జిన్‌ డోసులు అవసరమని, కానీ వైద్య,ఆరోగ్య శాఖ వద్ద కేవలం 50...
19-05-2021
May 19, 2021, 03:10 IST
సాక్షి, హైదరాబాద్‌:  రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటి ఫీవర్‌ సర్వే కారణంగా కోవిడ్‌ పాజటివ్‌ రేట్‌ తగ్గు ముఖం పడుతుందని రాష్ట్ర ప్రజారోగ్య...
19-05-2021
May 19, 2021, 02:48 IST
సాక్షి, నెట్‌వర్క్‌ : మొదటి దశలో చాలావరకు నగరాలు, పట్టణాలకు పరిమితమైన కరోనా, సెకండ్‌ వేవ్‌లో పల్లెలపై ప్రతాపం చూపిస్తోంది....
19-05-2021
May 19, 2021, 01:39 IST
సాక్షి, హైదరాబాద్‌: వరుసగా మూడు ఒలింపిక్స్‌లతోపాటు (1992 బార్సిలోనా, 1996 అట్లాంటా, 2000 సిడ్నీ) పలు ప్రపంచ చాంపియన్‌షిప్‌లలో... ఆసియా...
19-05-2021
May 19, 2021, 01:28 IST
న్యూఢిల్లీ: మరో భారత మహిళా క్రికెటర్‌ ఇంట్లో కరోనా కారణంతో విషాదం నెలకొంది. యువ క్రికెటర్‌ ప్రియా పూనియా తల్లి...
19-05-2021
May 19, 2021, 00:03 IST
కరోనా మహమ్మారి పంజా విసిరిననాటినుంచీ వినబడుతున్న కథనాలు గుండెలు బద్దలు చేస్తున్నాయి. ఆసరాగా వున్నవారు, పెద్ద దిక్కుగా వున్నవారు హఠాత్తుగా...
18-05-2021
May 18, 2021, 21:15 IST
సాక్షి, న్యూఢిల్లీ: దేశ ప్ర‌జ‌ల ప్రాణాలు ప‌ణంగా పెట్టి విదేశాలకు టీకాలు ఎగుమ‌తి చేయ‌లేదని కోవిషీల్డ్ త‌యారీదారు సీరం ఇన్‌స్టిట్యూట్...
18-05-2021
May 18, 2021, 17:39 IST
లక్నో: కరోనా మన జీవిన విధానాన్ని పూర్తిగా మార్చేసింది. సంబరాలు సంతోషాలు లేవు.. కనీసం నలుగురు మనుషుల కూడి దహన...
18-05-2021
May 18, 2021, 15:57 IST
తాజాగా కోవిడ్‌ పాజిటివ్‌గా తేలిన 8,983 మందిని, నెగిటివ్‌ వచ్చిన 80,893 మందిని పరిశీలించారు.
18-05-2021
May 18, 2021, 14:32 IST
సుమారు పాతికేళ్లకు పైగా ఇండస్ట్రీలో ఉన్న ఆయన ఉత్తమ మేకప్‌ మ్యాన్‌గా నంది అవార్డును సైతం అందుకున్నాడు..
18-05-2021
May 18, 2021, 13:05 IST
న్యూఢిల్లీ: ప్రస్తుతం ఏం మాట్లాడాలి అనుకున్నా కరోనాతోనే మొదలవుతుంది. దానితోనే ముగుస్తుంది. కరోనా చాలామంది జీవితాల్లో తీరని విషాదాన్ని నింపుతోంది. మనుషులు...
18-05-2021
May 18, 2021, 12:09 IST
సాక్షి, అమరావతి: కరోనా విజృంభణ నేపథ్యంలో  రాష్ట్ర ప్రజానీకానికి ఏపీ ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ (డీమ్డ్‌ వర్సిటీ) ప్రొఫెసర్లు, విద్యార్థులు ఊరటనిచ్చే...
18-05-2021
May 18, 2021, 11:33 IST
న్యూఢిల్లీ: కోవిడ్‌ టీకా పొందేందుకు కేంద్రం తీసుకువచ్చిన కోవిన్‌ పోర్టల్‌ ప్రజలకు మరింత చేరువకానుంది. ఈ యాప్‌ వచ్చే వారం...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top