Massive Fire Breaks Out In Qatar FIFA World Cup City Near Fan Village, Says Report - Sakshi
Sakshi News home page

FIFA WC 2022: ఫిఫా వరల్డ్‌కప్‌ స్టేడియం సమీపంలో భారీ అగ్నిప్రమాదం

Nov 26 2022 7:46 PM | Updated on Nov 26 2022 7:52 PM

Massive Fire Breaks-out In Qatar World Cup City Near Fan Village - Sakshi

ఖ‌త‌ర్‌లో వ‌ర‌ల్డ్‌క‌ప్ మ్యాచ్‌లు జ‌రుగుతున్న‌ స్టేడియంకు ద‌గ్గ‌ర్లో భారీ అగ్నిప్ర‌మాద సంభ‌వించింది. అయితే ఈ ప్రమాదంలో ఎవ‌రూ గాయ‌ప‌డ‌లేదని అధికారులు తెలిపారు. వ‌ర‌ల్డ్ క‌ప్ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇస్తున్న లూసెయిల్ స్టేడియం స‌మీపంలో కెటాయ్‌ఫ్యాన్ ఐలాండ్ నార్త్ ఫ్యాన్స్ విలేజ్ ఉంది. ఇక్క‌డికి ద‌గ్గ‌ర్లో నిర్మాణ ద‌శ‌లో ఉన్న బిల్డింగ్‌లో శ‌నివారం ఉద‌యం అగ్ని ప్రమాదం జరిగింది.

ద‌ట్ట‌మైన న‌ల్ల‌ని పొగ వ్యాపించింది. ప్ర‌మాదం గురించి తెలిసిన వెంట‌నే అగ్రిమాప‌క బృందాలు రంగంలోకి దిగి మంట‌ల్ని ఆర్పేశాయి. అయితే.. ఈ ప్ర‌మాదంలో ఎవ‌రూ గాయ‌ప‌డ‌లేద‌ని, ప్ర‌మాదానికి కార‌ణం ఏంట‌నేది తెలియ‌లేద‌ని అధికారులు తెలిపారు. రోడ్డు మీద వెళ్తున్న కొంద‌రు ప్రమాదం వీడియోల్ని సోష‌ల్‌మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో దృశ్యాలు వైరల్‌గా మారాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement