Asian Cup Table Tennis 2022: చరిత్ర సృష్టించిన మనిక బత్రా.. తొలి భారతీయ క్రీడాకారిణిగా..!

Manika Batra Becomes First Indian Woman To Reach Asian Cup TT Semifinals - Sakshi

బ్యాంకాక్‌: ఏషియన్‌ కప్‌ టేబుల్‌ టెన్నిస్‌ (టీటీ) టోర్నమెంట్‌ మహిళల సింగిల్స్‌ విభాగంలో భారత నంబర్‌వన్‌ మనిక బత్రా సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో ప్రపంచ 44వ ర్యాంకర్‌ మనిక 6–11, 11–6, 11–5, 11–7, 8–11, 9–11, 11–9తో ప్రపంచ 23వ ర్యాంకర్‌ చెన్‌ సు యు (చైనీస్‌ తైపీ)పై గెలుపొందింది. తద్వారా ఈ టోర్నీ చరిత్రలో సెమీఫైనల్‌ చేరిన తొలి భారతీయ క్రీడాకారిణిగా మనిక గుర్తింపు పొందింది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top