మెస్సీ కావాలంటే...రూ. 6 వేల కోట్లు | Lionel Messi Agrees Six Thousand Crores Manchester City Contract | Sakshi
Sakshi News home page

మెస్సీ కావాలంటే...రూ. 6 వేల కోట్లు

Sep 3 2020 8:16 AM | Updated on Sep 3 2020 8:33 AM

Lionel Messi Agrees Six Thousand Crores Manchester City Contract - Sakshi

బార్సిలోనా (స్పెయిన్‌): అర్జెంటీనా ఫుట్‌బాల్‌ సూపర్‌ స్టార్‌ లయోనల్‌ మెస్సీ బార్సిలోనా క్లబ్‌ వీడేందుకు సిద్ధంగా ఉన్నాడు. కానీ అతను కావాలంటే మాత్రం అందుకోవాల్సిన జట్టు వేల కోట్లు రాసులుగా పోయాల్సిందే! మాంచెస్టర్‌ సిటీ అతనిపై ఆసక్తి కనబరుస్తోంది. అయితే బార్సిలోనాతో కుదిరిన ఐదేళ్ల కాంట్రాక్టు గడువుకు ఇంకా ఏడాది మిగిలుంది. ఈ మధ్యలోపే బదిలీ కావాలనుకుంటే మాత్రం కాంట్రాక్టు క్లాజ్‌ ప్రకారం 70 కోట్ల యూరోలు అంటే భారత కరెన్సీలో అక్షరాలా రూ.6,070 కోట్లు మాంచెస్టర్‌ సిటీ వెచ్చించాలి. అప్పుడే బార్సిలోనా జట్టు 33 ఏళ్ల మెస్సీని విడుదల చేస్తుంది.

అయితే మాంచెస్టర్‌ సిటీ మాత్రం మెస్సీపై ఆశలు పెట్టుకుంది. ఈ మొత్తంపై బేరసారాలు జరిపి అయినా సరే అతన్ని దక్కించుకోవాలనే నిశ్చయంతో ఉంది. ఈ వ్యవహారం జరిగిపోతే ప్రొఫెషనల్‌ మేనేజర్‌ పెప్‌ గార్డియోలా నేతృత్వంలో మెస్సీ ఆడతాడు. మాంచెస్టర్‌ సిటీ జట్టుకు పెప్‌ మేనేజర్‌గా వ్యవహరిస్తున్నారు. యూరోపియన్‌ సాకర్‌ వర్గాల ప్రకారం కొత్త ఒప్పందం ప్రకారం మూడేళ్లు సిటీకి ఆడితే... మరో రెండేళ్లు న్యూయార్క్‌ ఎఫ్‌సీ తరఫున ఆడాల్సివుంటుంది. ఈ న్యూయార్క్‌ ఎఫ్‌సీ కూడా మాంచెస్టర్‌ సిటీకే చెందిన సిటీ ఫుట్‌బాల్‌ గ్రూప్‌ (సీఎఫ్‌జీ) జట్టే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement