పరిస్థితి ఎలా ఉంది.. మీరు ఏం చేస్తున్నారు?: లారా

Lara Confirms Tested Negative For Covid19 - Sakshi

ఆంటిగ్వా: తనకు కరోనా పాజిటివ్‌ వచ్చిందంటూ రూమర్లు పుట్టించడంపై వెస్టిండీస్‌ దిగ్గజ క్రికెటర్‌ బ్రియాన్‌ లారా మండిపడ్డాడు. ఏదొక న్యూస్‌ కోసం ఏదైనా రాసేస్తారా అంటూ ధ్వజమెత్తాడు. కేర్‌లెస్‌గా ఒక తప్పుడు సమాచారాన్ని ఎలా వ్యాప్తి చేస్తారంటూ సోషల్‌ మీడియా వేదికగా స్పందించాడు. ‘ హాయ్‌.. నాకు కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు చదివాను. ఈ రూమర్లను ఎందుకు పుట్టిస్తున్నారు. నేను చేయించుకున్న టెస్టులో నెగిటివ్‌ వచ్చింది. మరి అటువంటప్పుడు పాజిటివ్‌ అని రాయడం అవసరమా.. మీకొక విషయం చెప్పాలనుకుంటున్నా. (‘ఫ్యాబ్‌-4 బ్యాటింగ్‌ లిస్టులోకి వచ్చేశాడు’)

కేవలం మీరు రాసింది తప్పుడు సమాచారం అని చెప్పడమే కాదు.. ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందో చూస్తున్నారు కదా..ఇటువంటి తరుణంలో తప్పుడు వార్తలు రాయడం ఎంత వరకూ కరెక్ట్‌. పరిస్థితి ఏమిటి.. మీరు ఏమి చేస్తున్నారు. ఒక బాధ్యతలేని, అవసరం లేని సమాచారంతో నా సర్కిల్‌లో గందరగోళం సృష్టించారు. తప్పుడు సమాచారంతో నాకు చెడు ఏమీ జరగదు.. కానీ రూమర్లను నిజాలుగా చిత్రీకరించకండి’ అంటూ లారా మండిపడ్డాడు. ఏదైనా నెగిటివ్‌ యాంగిల్‌ ఒక వార్తను తీసుకుని దాన్ని హంగులు దిద్దడం సెన్సాషన్‌ కోసం కాకపోతే మరి ఏమిటి అని లారా కౌంటర్‌ ఇచ్చాడు. సమీప భవిష్యత్తులో ప్రతీచోటా కరోనా వైరస్‌ వ్యాప్తిని చూస్తామని, మనమంతా దాన్ని అధిగమించి క్షేమంగా ఉండాలని ఆశిస్తున్నట్లు లారా పేర్కొన్నాడు. (కోహ్లికి ఒత్తిడి తగ్గిస్తా: ఆసీస్‌ కెప్టెన్‌)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top