టీమిండియా స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఓ ఇంటివాడు కానున్నాడు. నవంబర్ చివరి వారంలో కుల్దీప్ వివాహం జరగనుంది. ఈ క్రమంలో టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం.. కుల్దీప్ తన పెళ్లికి సెలవు మంజారు చేయాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI)ని కుల్దీప్ అభ్యర్ధించినట్లు తెలుస్తోంది. సఫారీలతో తొలి టెస్టు తర్వాత తనను జట్టు నుంచి కుల్దీప్‌ను రిలీజ్ చేసే అవకాశముంది.
"కుల్దీప్ వివాహం నవంబర్ చివరి వారంలో జరగనుంది. అతడు సెలవు మంజూరు చేయాలని బోర్డును అభ్యర్దించాడు. అయితే షెడ్యూల్‌ను పరిగణలోకి తీసుకుని అతడికి ఎన్ని రోజులు సెలవు ఇవ్వాలనేది టీమ్ మేనేజ్‌మెంట్ నిర్ణయిస్తుంది బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.
కాగా ఏడాది జూన్‌లో తన చిన్ననాటి స్నేహితురాలు వంశికతో కుల్దీప్ నిశ్చితార్థం జరిగింది. ఆ సమయంలో యాదవ్ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నప్పటికి.. ఐపీఎల్ ముగింపు ఆలస్యం కావడంతో పెళ్లిని వాయిదా వేసుకున్నాడు.
అతడికి బీసీసీఐ సెలవు మంజారు చేస్తే నవంబర్ 22 నుంచి జరగనున్న రెండో టెస్టుకు కుల్దీప్ దూరమయ్యే అవకాశముంది. అతడి తిరిగి వన్డే సిరీస్‌కు భారత జట్టులోకి వచ్చే అవకాశముంది. ప్రస్తుతం కుల్దీప్ ఈడెన్ గార్డెన్స్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టుకు భారత ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కించుకున్నాడు.
క్విక్ స్పిన్నర్లకు అనుకూలంగా ఉండే ఈడెన్ వికెట్‌పై కుల్దీప్ మ్యాజిక్ చేసే అవకాశముంది. అంతకుముందు విండీస్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లోనూ కుల్దీప్ 12 వికెట్లు పడగొట్టాడు.
చదవండి: పాకిస్తాన్‌కు ఐసీసీ భారీ షాక్..


