ఐపీఎల్-2026లో ఢిల్లీ క్యాపిటల్స్ తిరిగి గెలుపు బాట పట్టింది. శనివారం (ఏప్రిల్ 18) చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఢిల్లీ విజయం సాధించింది. ఈ విజయంలో స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్‌ది కీలక పాత్ర. తన 34వ పుట్టినరోజున రాహుల్ అద్భుత హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు.
34 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 57 పరుగులు చేశాడు. ఈ క్రమంలో రాహుల్ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో రెండుసార్లు తన పుట్టినరోజున హాఫ్ సెంచరీ బాదిన తొలి ఆటగాడిగా రాహుల్ రికార్డు సృష్టించాడు.
గతంలో 2021 సీజన్‌లో (29వ పుట్టినరోజున) పంజాబ్ కింగ్స్ తరపున ఆడుతూ ఢిల్లీపై హాఫ్ సెంచరీతో మెరిశాడు. మళ్లీ ఇప్పుడు తన బర్త్‌డే రోజున హాఫ్ సెంచరీ సాధించడంతో ఈ అరుదైన ఫీట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ ఏడాది సీజన్‌లో ఇప్పటివరకు 5 మ్యాచ్‌లు ఆడిన రాహుల్.. 168 పరుగులు సాధించాడు.
ఐపీఎల్‌లో పుట్టిన రోజున అర్ద సెంచరీ చేసిన ఆటగాళ్లు
మైక్ హస్పీ
డేవిడ్ వార్నర్
కేఎల్ రాహుల్(రెండు సార్లు)


