'ప్లే ఆఫ్‌ ఆడకు.. అప్పుడే నీ విలువ తెలుస్తుంది'

Kieron Pollard Shares Scathing Message Confuses Social Media Users - Sakshi

షార్జా : ఐపీఎల్‌ 13వ సీజన్‌లో మంగళవారం ముంబై ఇండియన్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మధ్య చివరి లీగ్‌ మ్యాచ్‌ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ ముంబైపై 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి ప్లేఆఫ్స్‌కు చేరింది. ఈ మ్యాచ్‌ విజయం సంగతి పక్కన పెడితే ముంబై ఇండియన్స్‌ వైస్‌ కెప్టెన్‌ కీరన్‌ పొలార్డ్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌తో పాటు ట్విటర్‌లో ఒక ఆసక్తికర పోస్ట్‌ను పెట్టాడు. పొలార్డ్‌పై ఎవరో తెలియని కోపం ప్రదర్శిస్తున్నారనేలా ఆ కామెంట్‌ ఉంది. 'రహస్యంగా స్నేహం ముసుగులో నన్ను అణిచివేసే వారికంటే .. నేను శత్రువుగా భావించని వారు నన్ను ఎక్కువ ద్వేషిస్తున్నారు.'అంటూ పోస్ట్‌ చేశాడు.

అయితే ఆ కామెంట్‌ ఎవరిని ఉద్దేశించి చేశాడనేది మాత్రం తెలియదు. తాజాగా వన్డే జట్టుకు పొలార్డ్‌ స్థానంలో జాసన్‌ హోల్డర్‌ను ఎంపిక చేశారు. అలాగే రోహిత్‌ గైర్హాజరీలో ఐపీఎల్‌ 13వ సీజన్‌లో ముంబై ఇండియన్స్‌ జట్టుకు కెప్టెన్‌గా ప్రాతినిధ్యం వహించిన సంగతి తెలిసిందే. అయితే ఎస్‌ఆర్‌హెచ్‌ మ్యాచ్‌కు రోహిత్‌ అందుబాటులోకి రావడంతో పొలార్డ్‌ వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఈ రెండు విషయాలను దృష్టిలో పెట్టుకొని సోషల్‌ మీడియాలో పెద్ద చర్చే నడిచింది. కొందరేమో పొలార్డ్‌ ఆ కామెంట్‌ చేయడం వెనుక ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అని.. మరికొందరు మాత్రం జాసన్‌ హోల్డర్‌ ఉన్నాడని అంటున్నారు. ఇంకొందకు మాత్రం ఇంకాస్త ముందుకెళ్లి 'పొలార్డ్‌.. నువ్వు ఢిల్లీతో జరిగే ప్లేఆఫ్‌ మ్యాచ్‌లో ఆడకు.. అప్పుడే నీ విలువ రోహిత్‌ శర్మకు అర్థమవుతుంది. అంటూ' కామెంట్స్‌ చేశాడు. కాగా గురువారం జరగనున్నమొదటి క్వాలిఫయర్‌ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌  ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది. (చదవండి : 'ధోని ఇంపాక్ట్‌ ఎంత అనేది అ‍ప్పుడు తెలిసింది')

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top