మూడో టెస్టుకు ఆసీస్ తుది జ‌ట్టు ప్ర‌క‌ట‌న‌.. | Australia Announced Playing XI For Gabba Test, Josh Hazlewood Back And Check Other Names Inside | Sakshi
Sakshi News home page

IND vs AUS: మూడో టెస్టుకు ఆసీస్ తుది జ‌ట్టు ప్ర‌క‌ట‌న‌.. వికెట్ల వీరుడు వ‌చ్చేశాడు

Dec 13 2024 8:14 AM | Updated on Dec 13 2024 9:36 AM

Josh Hazlewood returns Australia announces Playing XI for Gabba Test,

బ్రిస్బేన్ వేదిక‌గా టీమిండియాతో జ‌ర‌గ‌నున్న మూడో టెస్టు కోసం క్రికెట్ ఆస్ట్రేలియ త‌మ తుది జ‌ట్టును ప్ర‌కటించింది. రెండో టెస్టుకు గాయం కార‌ణంగా దూర‌మైన స్టార్ పేస‌ర్ జోష్ హేజిల్‌వుడ్ తిరిగి జట్టులోకి  వచ్చాడు.

దీంతో స్కాట్ బోలాండ్ మళ్లీ బెంచ్‌కే ప‌రిమిత‌మవ్వాల్సి వ‌చ్చింది. ఇదొక్క‌టి మిన‌హా మిగిలిన జట్టులో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. తొలి రెండు మ్యాచ్‌ల్లో విఫ‌ల‌మైన స్టార్ ప్లేయ‌ర్లు మిచెల్ మార్ష్‌, స్టీవ్ స్మిత్ ఆస్ట్రేలియా జ‌ట్టు మెనెజ్‌మెంట్ మ‌రోసారి అవ‌కాశ‌మిచ్చింది.

కాగా అడిలైడ్ టెస్టులో బోలాండ్ 5 వికెట్లు ప‌డ‌గొట్టి అద్బుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచాడు. కానీ హాజిల్‌వుడ్ పూర్తి ఫిట్‌నెస్ సాధించ‌డంతో అత‌డిని ప‌క్క‌న పెట్ట‌క త‌ప్ప‌డం లేద‌ని ఆసీస్ కెప్టెన్ ప్యాట్ క‌మ్మిన్స్ తెలిపాడు.

ఇక​ శనివారం(డిసెంబర్‌14) ప్రారంభం కానున్న ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు సత్తాచాటాలని భావిస్తున్నాయి. భారత జట్టులో కూడా ఒకట్రెండు మార్పులు చోటు చేసుకునే ఛాన్స్‌ ఉంది. హర్షిత్‌ రాణా, అశ్విన్‌ స్ధానాల్లో ప్రసిద్ద్‌ కృష్ణ, జడేజా తుది జట్టులోకి రానున్నట్లు తెలుస్తోంది.

కాగా తొలి టెస్టులో ఆసీస్‌ను 295 పరుగుల తేడాతో భారత్‌ చిత్తు చేయగా.. రెండో టెస్టులో ఆతిథ్య ఆస్ట్రేలియా 10 వికెట్ల తేడాతో టీమిండియాను ఓడించింది. ప్రస్తుతం ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ 1-1తో సమంగా ఉంది.

మూడో టెస్టుకు ఆస్ట్రేలియా తుది జట్టు: ఉస్మాన్ ఖవాజా, నాథన్ మెక్‌స్వీనీ, మార్నస్ లాబుస్‌చాగ్నే, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, మిచ్ మార్ష్, అలెక్స్ కారీ (వికెట్ కీప్‌) పాట్ కమిన్స్, మిచ్ స్టార్క్, నాథన్ లియాన్, జోష్ హాజిల్‌వుడ్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement