'ఆ ఎమోషన్‌ను చాలా మిస్సవుతున్నాం'

Jos Buttler Says Missing Emotion With Fans Playing IPL 2020 - Sakshi

దుబాయ్‌ : కరోనా వైరస్‌ కారణంగా దుబాయ్‌లో జరుగుతున్న ఐపీఎల్‌ 13వ సీజన్‌లో స్టేడియంలోకి అభిమానులకు అనుమతి ఇవ్వని సంగతి తెలిసిందే. దీంతో మ్యాచ్‌లన్నీ ప్రేక్షకులు లేకపోవడంతో ఆటగాళ్లు కూడా బోసిగా ఫీలవుతున్నారు. ఐతే ప్రేక్షకుల్లేకుండా మ్యాచులు ఆడడం ఆటగాళ్లపై చాలా ప్రభావం చూపిస్తుందని..  వారు లేకపోవడం వల్ల ఆటలో ఎమోషన్ మిస్ అవుతుందని రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు జోస్ బట్లర్ తెలిపాడు.(చదవండి : అప్పుడు ట్రోల్‌ చేసి ఇప్పుడు జాలి చూపిస్తున్నారా!)

'ఇదంతా నాకు ఆశ్చర్యం కలిగిస్తుంది. స్టేడియం నిండా జనం ఉండి, మ్యాచు గెలుస్తామా లేదా అన్న సంధిగ్ధంలో ఉన్న టైమ్ లో ప్రేక్షకుల నుంచి వచ్చే ఎనర్జీనీ చాలా మిస్సవుతున్నాం. వారి ఇచ్చే ఎనర్జీ మాకు ఆటలో చాలా ఉపయోగపడుతుంది. అదీగాక ఆటగాడిపై ఉన్న ఒత్తిడిని తగ్గించి మరింత బాగా ఆడే అవకాశం కల్పిస్తుంది. కానీ ప్రస్తుతం ఐపీఎల్ మ్యాచుల్లో ఆ ఎమోషన్ మిస్ అవుతున్నాం. ధోని, కోహ్లి లాంటి ఆటగాళ్లకు విపరీతమైన ఫ్యాన్‌ ఫోలోయింగ్‌ ఉంటుంది. వాళ్లు ఒక్క షాట్‌ కొట్టినా ప్రేక్షకులు గోలగోల చేస్తారు.వారు చేసే గోలకు ప్రత్యర్థి జట్లలో ఉండే యువ ఆటగాళ్లకు భయం ఉండేది.. కానీ ఇప్పుడు కరోనా నిబంధనలతో వారికి మద్దతు ఇచ్చేందుకు ఫ్యాన్స్‌ ఉండరు.ఇది ఒకింత యువ ఆటగాళ్లకు మేలు చేస్తుందనే చెప్పొచ్చు. (చదవండి : ఫస్ట్‌ బాల్‌కే వికెట్‌.. ఇది ఔటా?)

ఒకవేళ  పరిస్థితులు  మెరుగుపడితే గనుక స్టేడియంలోకి  కొంత మందిని మైదానంలోకి అనుమతించాలని ఐపీఎల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ను కోరుతున్నా. టోర్నమెంట్ ద్వితీయార్థంలో ఈ విధంగా చేస్తే మ్యాచుల్లో మరింత మజా వచ్చే అవకాశం ఉందని' బట్లర్‌ తెలిపాడు. కాగా జోస్‌ బట్లర్‌ ఐపీఎల్‌ 13వ సీజన్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top