ఫైనల్లో జైస్మీన్‌ | Jasmine Lamboria in the final of the Asian Boxing Championship | Sakshi
Sakshi News home page

ఫైనల్లో జైస్మీన్‌

Apr 8 2026 12:59 AM | Updated on Apr 8 2026 12:59 AM

Jasmine Lamboria in the final of the Asian Boxing Championship

ఉలాన్‌బాటర్‌ (మంగోలియా): ఆసియా బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్లు జైస్మీన్‌ లంబోరియా (57 కేజీలు), మీనాక్షి హుడా (48 కేజీలు), విశ్వనాథ్‌ సురేశ్‌ (50 కేజీలు), సచిన్‌ సివాచ్‌ (60 కేజీలు) ఫైనల్లోకి దూసుకెళ్లారు. సెమీఫైనల్స్‌లో జైస్మీన్‌ 3–2తో నిగీనా ఉక్తమోవా (ఉజ్బెకిస్తాన్‌)పై, మీనాక్షి 4–1తో థిప్‌సాచా (థాయ్‌లాండ్‌)పై, విశ్వనాథ్‌ 5–0తో సాన్‌జార్‌ (కజకిస్తాన్‌)పై, సచిన్‌ 4–1తో రువామ్‌థామ్‌ (థాయ్‌లాండ్‌)పై గెలిచారు. 

ఆకాశ్‌ (75 కేజీలు), లోకేశ్‌ (85 కేజీలు), నరేందర్‌ బెర్వాల్‌ (ప్లస్‌ 90 కేజీలు), హర్‌‡్ష (90 కేజీలు) సెమీఫైనల్లో ఓడిపోయి కాంస్య పతకాలతో సరిపెట్టుకున్నారు. ఓవరాల్‌గా ఈ టోరీ్నలో ఎనిమిది మంది భారత బాక్సర్లు ఫైనల్లోకి ప్రవేశించారు.   

Advertisement
 
Advertisement
Advertisement