ఐఎస్‌ఎల్‌లో తొలి భారతీయ హెడ్‌ కోచ్‌గా ఖాలిద్‌ జమీల్‌

ISL Football Tournament Khalid Jamil Becomes North East United Football Club Head Coach - Sakshi

గువాహటి: ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ (ఐఎస్‌ఎల్‌) ఫుట్‌బాల్‌ టోర్నీలో ఓ ప్రాంచైజీకి తొలిసారి ఓ భారతీయుడు హెడ్‌ కోచ్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు. భారత్‌ తరఫున 11 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన 44 ఏళ్ల ఖాలిద్‌ జమీల్‌ను నార్త్‌ ఈస్ట్‌ యునైటెడ్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌ జట్టు హెడ్‌ కోచ్‌గా ఆ ఫ్రాంచైజీ నియమించింది. గతేడాది జమీల్‌ జట్టు తలరాతను అసాధారణంగా మార్చేశాడు. వరుస పరాజయాలతో నార్త్‌ ఈస్ట్‌ డీలాపడగా... హెడ్‌ కోచ్‌ గెరార్డ్‌ నుస్‌ నుంచి తాత్కాలిక బాధ్యతలు చేపట్టిన ఖాలిద్‌ వరుసగా తొమ్మిది మ్యాచ్‌ల్లో విజేతగా నిలిపాడు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top