ఉత్కంఠ పోరులో ఆర్సీబీపై ఢిల్లీ విజయం | IPL 2026: Royal Challengers Bengaluru vs Delhi Capitals Live Updates | Sakshi
Sakshi News home page

IPL 2026: ఉత్కంఠ పోరులో ఆర్సీబీపై ఢిల్లీ విజయం

Apr 18 2026 3:06 PM | Updated on Apr 18 2026 7:41 PM

IPL 2026: Royal Challengers Bengaluru vs Delhi Capitals Live Updates

IPL 2026 RCB vs DC Live updates: చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో జరిగిన ఉత్కంఠ పోరులో 6 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌ విజయం సాధించింది. చివరి ఓవర్‌లో ఢిల్లీ విజయానికి 15 పరుగులు అవసరం కాగా.. డేవిడ్‌ మిల్లర్‌ వరుసగా సిక్సర్లు బాది మ్యాచ్‌ను ఫినిష్‌ చేశాడు. 

ఫలితంగా 176 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ 19.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి చేధించింది. ఢిల్లీ బ్యాటర్లలో మిల్లర్‌(10 బంతుల్లో 22)తో పాటు కేఎల్‌ రాహుల్‌(34 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 57), ట్రిస్టన్‌ స్టబ్స్‌(47 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్సర్‌తో 60) అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడారు. ఆర్సీబీ బౌలర్లలో భువనేశ్వర్‌ కుమార్‌ మూడు వికెట్లు పడగొట్టగా.. కృనాల్‌ పాండ్యా ఓ వికెట్‌ సాధించాడు.

👉ఢిల్లీ విజయానికి 12 బంతుల్లో 25 పరుగులు కావాలి. క్రీజులో స్టబ్స్‌, మిల్లర్‌ ఉన్నారు. 

16 ఓవర్లకు ఢిల్లీ స్కోర్‌: 135/4
16 ఓవర్లు ముగిసే సరికి ఢిల్లీ క్యాపిటల్స్‌ 4 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. ఢిల్లీ విజయానికి 24 బంతుల్లో 41 పరుగులు కావాలి. అక్షర్‌పటేల్‌ గాయం కారణంగా రిటైర్డ్‌ హార్ట్‌గా వెనుదిరిగాడు.

కేఎల్‌ రాహుల్‌ ఔట్‌..
దూకుడుగా ఆడుతున్న కేఎల్‌ రాహుల్‌ (57) కృనాల్‌ పాండ్యా బౌలింగ్‌లో కోహ్లికి క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం ఢిల్లీ 11 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 94 పరుగులు చేసింది.

8 ఓవర్లకు ఢిల్లీ స్కోర్‌: 74/3
8 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ 3 వికెట్ల నష్టానికి 70 పరుగులు చేసింది. క్రీజులో కేఎల్‌ రాహుల్‌(45), స్టబ్స్‌(12) ఉన్నారు.

దూకుడుగా ఆడుతున్న కేఎల్‌ రాహుల్‌
5 ఓవర్లు ముగిసేసరికి ఆర్సీబీ 3 వికెట్ల నష్టానికి 45 పరుగులు చేసింది. క్రీజులో కేఎల్‌ రాహుల్‌(30), స్టబ్స్‌(5) ఉన్నారు.

నిప్పులు చెరుగుతున్న భువనేశ్వర్‌
భువనేశ్వర్‌ కుమార్‌ నిప్పులు చెరుగుతున్నాడు. 3 ఓవర్‌ వేసిన భువనేశ్వర్‌ కుమార్‌ బౌలింగ్‌లో ఆర్సీబీ రెండు వికెట్లు కోల్పోయింది. కరుణ్‌ నాయర్‌(5), సమీర్‌ రిజ్వీ(2) వరుస క్రమంలో పెవిలియన్‌కు చేరారు.

ఢిల్లీ తొలి వికెట్‌ డౌన్‌
176 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆదిలోనే భారీ షాక్‌ తగిలింది. కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసిన ఫాథుమ్‌ నిస్సాంక..భువనేశ్వర్‌ కుమార్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు.
ఆర్సీబీ స్కోరెంతంటే?
చిన్నస్వామి స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆర్సీబీ బ్యాటర్లు మెరుగైన ప్రదర్శన చేయలేకపోయారు. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. ఆర్సీబీ బ్యాటర్లలో ఫిల్‌ సాల్ట్‌(63) పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. మిగితా ప్లేయర్లంతా నామమాత్రపు స్కోర్లకే పరిమితమయ్యారు. ఢిల్లీ బౌలర్లలో లుంగి ఎంగిడీ, కుల్దీప్‌ యాదవ్‌, అక్షర్‌ పటేల్‌ తలా రెండు వికెట్లు సాధించగా.. ముఖేష్‌ కుమార్‌ ఓ వికెట్‌ పడగొట్టాడు.

ఆర్సీబీ ఆరో వికెట్‌ డౌన్‌
ఆర్సీబీ వరుస క్రమంలో వికెట్లు కోల్పోయింది. కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసిన రోమారియో షెపర్డ్.. కుల్దీప్‌ యాదవ్‌ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయాడు.

ఆర్సీబీ ఐదో వికెట్‌ డౌన్‌
ఆర్సీబీ ఐదో వికెట్‌ కోల్పోయింది. 26 పరుగులు చేసిన డేవిడ్‌.. అక్షర్‌ పటేల్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 15.2 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్‌: 146-5
ఆర్సీబీ నాలుగో వికెట్‌ డౌన్‌
ఆర్సీబీ నాలుగో వికెట్‌ కోల్పోయింది. 8 పరుగులు చేసిన పాటిదార్‌.. ముఖేష్‌ కుమార్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 12.4  ఓవర్లకు ఆర్సీబీ స్కోర్‌ 131-4

ఆర్సీబీ మూడో వికెట్‌ డౌన్‌
ఆర్సీబీ మూడో వికెట్‌ కోల్పోయింది. 63 పరుగులు చేసిన ఫిల్‌ సాల్ట్‌.. కుల్దీప్‌ యాదవ్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు.

ఆర్సీబీ రెండో వికెట్‌ డౌన్‌
ఆర్సీబీ రెండో వికెట్‌ కోల్పోయింది. 18 పరుగులు చేసిన రజత్‌ పాటిదార్‌.. అక్షర్‌ పటేల్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 10 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్‌: 99/2

దూకుడుగా ఆడుతున్న సాల్ట్‌
8 ఓవర్లకు ఆర్సీబీ వికెట్ నష్టానికి 79 పరుగులు చేసింది. క్రీజులో ఫిల్‌ సాల్ట్‌(45), పడిక్కల్‌(11) ఉన్నారు.

ఆర్సీబీ తొలి వికెట్‌ డౌన్‌
52 పరుగుల వద్ద ఆర్సీబీ తొలి వికెట్‌ కోల్పోయింది. 19 పరుగులు చేసిన విరాట్‌ కోహ్లి.. ఎంగిడీ బౌలింగ్‌లో ఔటయ్యాడు.

3 ఓవర్లకు ఆర్సీబీ స్కోరెంతంటే?
3 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ వికెట్‌ నష్టపోకుంగా 29 పరుగులు చేసింది. క్రీజులో విరాట్‌ కోహ్లి(14), సాల్ట్‌(10) ఉన్నాడు.

ఐపీఎల్‌-2026 సీజ‌న్‌లో భాగంగా చిన్న‌స్వామి స్టేడియం వేదిక‌గా రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు, ఢిల్లీ క్యాపిట‌ల్స్ త‌ల‌ప‌డ‌తున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. ఇరు జట్లు ఎటువం‍టి మార్పులు లేకుండా ఆడుతున్నాయి. కాగా ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ గ్రీన్‌ జెర్సీ ధరించి బరిలోకి దిగింది. సమాజంలో పర్యావరణంపై అవగాహన కల్పించేందుకే ఆర్సీబీ గ్రీన్ జెర్సీతో ఆడుతోంది.

తుది జట్లు:
ఢిల్లీ క్యాపిటల్స్: పాతుమ్ నిస్సాంక, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్‌), సమీర్ రిజ్వీ, అక్షర్ పటేల్(కెప్టెన్‌), డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, ఔకిబ్ నబీ దార్, లుంగి ఎన్గిడి, కుల్దీప్ యాదవ్, టి నటరాజన్, ముఖేష్ కుమార్

ఇంపాక్ట్ సబ్స్: విప్రజ్ నిగమ్, అశుతోష్ శర్మ, కరుణ్ నాయర్, దుష్మంత చమీర, నితీష్ రాణా

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లి, ఫిలిప్ సాల్ట్, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్(కెప్టెన్‌), జితేష్ శర్మ(వికెట్ కీపర్‌), టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, సుయాష్ శర్మ, జోష్ హాజిల్‌వుడ్

ఇంపాక్ట్ సబ్స్: రసిఖ్ సలాం దార్, వెంకటేష్ అయ్యర్, జోర్డాన్ కాక్స్, , మంగేష్ యాదవ్, విక్కీ ఓస్ట్వాల్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement