IPL 2022 Retention- Auction: కోట్ల ఖర్చు.. మెగా వేలం.. ఆ ఫ్రాంఛైజీ పర్సులో 72 కోట్లు.. మరి మిగిలిన జట్ల వద్ద ఎంతంటే!

IPL 2022 Retention Retained Players Money Deducted Remaining Salary Purse - Sakshi

IPL 2022 Retention Retained Players Money Deducted Remaining Salary Purse Full Details Here: ఐపీఎల్‌-2022 మెగా వేలం నేపథ్యంలో రిటైన్‌ చేసుకునే ఆటగాళ్ల జాబితాను ఫ్రాంచైజీలు మంగళవారం సమర్పించాయి. చెన్నై, ముంబై, పంజాబ్‌, రాజస్తాన్‌, హైదరాబాద్‌, కోల్‌కతా, ఢిల్లీ, బెంగళూరు.. 8 ఫ్రాంఛైజీలు మొత్తంగా 27 మందిని అట్టిపెట్టుకున్నాయి. ఈ క్రమంలో 15వ సీజన్‌తో క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో ఎంట్రీ ఇవ్వనున్న లక్నో, అహ్మదాబాద్‌ డిసెంబర్‌ 25లోగా గరిష్టంగా ముగ్గురు చొప్పున క్రికెటర్లను తీసుకోవాల్సి ఉంటుంది.

ఆ తర్వాత మిగిలిన క్రికెటర్లంతా వేలానికి అందుబాటులోకి వస్తారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఐపీఎల్‌లో భాగమైన 8 జట్లు రిటైన్‌ చేసుకున్న ఆటగాళ్ల కోసం ఎంత మొత్తం ఖర్చు చేశాయి? రిటెన్షన్‌ ప్రక్రియ ముగిసిన తర్వాత ఏ ఫ్రాంఛైజీ పర్సులో ఎంత మిగిలింది అన్న అంశాలను పరిశీలిద్దాం.

చెన్నై సూపర్‌కింగ్స్‌
ఐపీఎల్‌-2021 విజేత చెన్నై సూపర్‌ కింగ్స్‌ రవీంద్ర జడేజా(16 కోట్లు), ఎంఎస్‌ ధోని(12 కోట్లు), మొయిన్‌ అలీ(8 కోట్లు), రుతురాజ్‌ గైక్వాడ్‌(6 కోట్లు)ను కొనసాగిస్తామని ప్రకటించింది. వీరి కోసం మొత్తంగా 42 కోట్లు ఖర్చు చేసింది. ప్రస్తుతం చెన్నై పర్సులో 48 కోట్ల రూపాయలు ఉన్నాయి. 

ఢిల్లీ క్యాపిటల్స్‌
కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌(16 కోట్లు), అక్షర్‌ పటేల్‌ (రూ. 9 కోట్లు), పృథ్వీ షా (రూ. 7.50 కోట్లు), నోర్జే (రూ. 6.50 కోట్లు) నలుగురిని రిటైన్‌ చేసుకుంది. అయితే, అక్షర్, పృథ్వీ షాను వరుసగా 9, 7.5 కోట్ల రూపాయలకే కొనుగోలు చేసినప్పటికీ రిటెన్షన్‌ నిబంధనల ప్రకారం పర్సు నుంచి 12 కోట్లు, 8 కోట్లు ఖర్చు చేయాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో రిటెన్షన్‌ కోసం 42.5 కోట్లు వెచ్చించగా.. ఆ జట్టు ప​ర్సులో మిగిలిన మొత్తం 47.5 కోట్లు.

బెంగళూరు రాయల్‌ చాలెంజర్స్‌ 
బెంగళూరు ఫ్రాంఛైజీ విరాట్‌ కోహ్లి (రూ.15 కోట్లు), మ్యాక్స్‌వెల్‌ (రూ. 11 కోట్లు), మహ్మద్‌ సిరాజ్‌ (రూ. 7 కోట్లు)ను రిటైన్‌ చేస్తామని ప్రకటించింది. ఇందుకు గానూ పర్సు నుంచి 33 కోట్లు ఖర్చు పెట్టగా ఇంకా 57 కోట్ల రూపాయలు మిగిలి ఉన్నాయి.

కోల్‌కతా నైట్‌ రైడర్స్‌
ఆండ్రీ రసెల్‌ (రూ. 12 కోట్లు), వరుణ్‌ చక్రవర్తి (రూ. 8 కోట్లు), వెంకటేశ్‌ అయ్యర్‌ (రూ. 8 కోట్లు), సునీల్‌ నరైన్‌ (రూ. 6 కోట్లు)ను కేకేఆర్‌ అట్టిపెట్టుకుంది. అయిఏత రసెల్‌ కోసం అదనంగా నాలుగు కోట్లు(మొదటి రిటెన్షన్‌), వరుణ్‌ చక్రవర్తి కోసం 4 కోట్లు పర్సు నుంచి తీయాల్సి వచ్చింది. దీంతో 42 కోట్లు ఖర్చయ్యాయి. ఈ నేపథ్యంలో కేకేఆర్‌ పర్సులో మిగిలిన మొత్తం..  48 కోట్లు.

ముంబై ఇండియన్స్‌
టీమిండియా టీ20 కెప్టెన్‌, తమ జట్టు సారథి రోహిత్‌ శర్మ (రూ. 16 కోట్లు), బుమ్రా (రూ. 12 కోట్లు), సూర్యకుమార్‌ యాదవ్‌ (రూ. 8 కోట్లు), కీరన్‌ పొలార్డ్‌ (రూ. 6 కోట్లు)ను ముంబై ఫ్రాంఛైజీ కొనసాగిస్తామని తెలిపింది. ఈ క్రమంలో నలుగురు ఆటగాళ్ల రిటెన్షన్‌ కోసం 42 కోట్లు ఖర్చు చేసింది. ఇక వారి పర్సులో ఇంకా 48 కోట్లు ఉన్నాయి.

పంజాబ్‌ కింగ్స్‌
కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ జట్టుతో కొనసాగేందుకు ఇష్టపడకపోవడంతో మయాంక్‌ అగర్వాల్‌ (రూ. 12 కోట్లు)కు జాక్‌పాట్‌ తగిలింది. మయాంక్‌తో పాటు అర్ష్‌దీప్‌ సింగ్‌ (అన్‌క్యాప్డ్‌ – రూ. 4 కోట్లు)ను పంజాబ్‌ రిటైన్‌ చేసుకుంది. ఈ క్రమంలో ఖర్చైన 16 కోట్లు పోనూ.. పంజాబ్‌ పర్సులో మిగిలిన మొత్తం 72 కోట్లు. కేవలం ఇద్దరినే రిటైన్‌ చేసుకోవడంతో వేలం సమయానికి అత్యధిక మొత్తం ఈ ఫ్రాంఛైజీ పర్సులోనే ఉండటం విశేషం.

రాజస్తాన్‌ రాయల్స్‌
కెప్టెన్‌ సంజు సామ్సన్‌ (రూ. 14 కోట్లు), జాస్‌ బట్లర్‌ (రూ. 10 కోట్లు), యశస్వి జైస్వాల్‌ (అన్‌క్యాప్డ్‌ – రూ. 4 కోట్లు)ను రాజస్తాన్‌ కొనసాగించనుంది. ఈ క్రమంలో 28 కోట్లు ఖర్చు కాగా.. ఇంకా 62 కోట్లు పర్సులో ఉన్నాయి.

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌
కేన్‌ విలియమ్సన్‌ (రూ. 14 కోట్లు), అబ్దుల్‌ సమద్‌ (అన్‌క్యాప్డ్‌ – రూ. 4 కోట్లు), ఉమ్రాన్‌ మలిక్‌ (అన్‌క్యాప్డ్‌ – రూ. 4 కోట్లు) మొత్తంగా ముగ్గురిని రిటైన్‌ చేసుకుంది. ఇందుకోసం 22 కోట్లు వెచ్చించగా.. పర్సులో మిగిలిన మొత్తం 68 కోట్లు.
►కాగా ఐపీఎల్‌ ఫ్రాంఛైజీ పర్సులో 90 కోట్ల రూపాయలు ఉంటాయన్న సంగతి తెలిసిందే.

ఫ్రాంఛైజీ రిటైన్‌ చేసుకున్న ఆటగాళ్ల సంఖ్య సాలరీ(రూపాయల్లో) పర్సు నుంచి తీసిన మొత్తం(రూపాయల్లో) వేలానికి పర్సులో ఉన్న మొత్తం(రూపాయల్లో)
ఢిల్లీ క్యాపిటల్స్‌ 4 39 కోట్లు  42.5 కోట్లు 47.5 కోట్లు
చెన్నై సూపర్‌ కింగ్స్‌ 4 42 కోట్లు  42 కోట్లు 48 కోట్లు
రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు 3 33 కోట్లు 33 కోట్లు  57 కోట్లు
కోల్‌కతా నైట్‌రైడర్స్‌

4

34 కోట్లు

 42 కోట్లు

 48 కోట్లు

ముంబై ఇండియన్స్‌ 4 42 కోట్లు

 42 కోట్లు

48 కోట్లు
పంజాబ్‌ కింగ్స్‌ 2

16 కోట్లు

18 కోట్లు 72 కోట్లు
రాజస్తాన్‌ రాయల్స్‌

3

28 కోట్లు

 28 కోట్లు  62 కోట్లు
సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 3 22 కోట్లు 22 కోట్లు 68 కోట్లు

చదవండి: IPL 2022 Mega Auction:‘బంపర్‌ అనౌన్స్‌మెంట్‌’.. ఇదే చివరి మెగా వేలం.. ఇక ముందు!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top