IPL 2022 CSK: అతనితో బ్యాటింగ్ చేయడంలో ఉన్న కిక్కే వేర‌ప్పా..

IPL 2022: Ravindra Jadeja Reveals His Favourite Batting Partner At CSK - Sakshi

ఐపీఎల్ జ‌ట్టైన చెన్నై సూప‌ర్ కింగ్స్‌తో ప‌దేళ్ల ప్ర‌యాణం పూర్తైన సంద‌ర్భంగా ఆ జ‌ట్టు స్టార్ ఆల్‌రౌండ‌ర్,  రవీంద్ర జడేజా కొన్ని ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను వెల్ల‌డించాడు. సీఎస్‌కే‌తో దశాబ్దకాల బంధం పూర్తయిన నేప‌థ్యంలో ఫ్రాంచైజీ అధికారిక వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన బెస్ట్ బ్యాటింగ్ పార్టనర్ (ఫ్రాంచైజీ) ఎవ‌రో రివీల్ చేశాడు. 

టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోని తన బెస్ట్ బ్యాటింగ్ పార్టనర్ అని, అత‌నితో బ్యాటింగ్ చేస్తుంటే ఆ మ‌జానే వేర‌ని చెప్పుకొచ్చాడు. ఈ సంద‌ర్భంగా సీఎస్‌కేతో తనకున్న భావోద్వేగ బంధాన్ని గుర్తు చేసుకుంటూ.. ఫ్రాంచైజీ తనకు సొంత ఇల్లు లాంటిదని, ఫ్రాంచైజీ పెద్దలు, స‌హ‌చ‌ర ఆట‌గాళ్లు త‌న కుటుంబ స‌భ్యుల్లాంటి వార‌ని తెలిపాడు. 

అలాగే ధోని త‌న కెరీర్‌కు పిల్లర్ లాంటి వాడ‌ని, కెరీర్ చివరి మ్యాచ్ వరకు సీఎస్‌కేతోనే కొన‌సాగాల‌ని భావిస్తున్నానని పేర్కొన్నాడు. జైపూర్‌లో జ‌రిగిన ఓ మ్యాచ్‌లో ధోని త‌న త‌ల‌పై (హెల్మెట్‌) కొట్టిన‌ ఘటనను గుర్తు చేసుకుంటూ.. ధోని అలా ఎందుకు చేశాడ‌న్న విష‌యాన్ని వివ‌రించాడు. ఆ మ్యాచ్‌లో షాట్ ఆడే క్రమంలో కిందపడిపోగా, మాహీ భాయ్ రన్ రన్ అంటూ అరుస్తూ నా దగ్గరకు వచ్చి స‌ర‌దాగా అలా చేశాడ‌ని గుర్తు చేసుకున్నాడు. 

సీఎస్‌కేకు ఆడిన‌ కొత్తలో వినూత్న హెయిర్ కట్‌తో కనిపించిన సంద‌ర్భాన్ని ప్ర‌స్తావిస్తూ.. రైనా స‌ల‌హా మేర‌కు సీఎస్‌కే అక్షరాలు కనిపించేలా హెయిర్ కట్ చేసుకున్నానని చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉంటే, 2022 సీజ‌న్‌ మెగా వేలానికి ముందు ఆట‌గాళ్ల రిటెన్షన్‌లో భాగంగా జ‌డేజాకు సీఎస్‌కే రూ.16 కోట్లు చెల్లించి అట్టిపెట్టుకుంది.
చ‌ద‌వండి: IND VS SL 2nd T20: కోహ్లి రికార్డుకే ఎస‌రు పెట్టిన హిట్‌మ్యాన్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top