Breadcrumb
Live Updates
IPL 2022: లక్నో సూపర్ జెయింట్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ లైవ్ అప్డేట్స్
పంజాబ్ కింగ్స్‌పై లక్నో సూపర్ జెయింట్స్ ఘన విజయం
పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ 21 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 154 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 133 పరుగులు మాత్రమే చేయగలిగింది.
లక్నో బౌలర్ల దాటికి పంజాబ్ బ్యాట్స్‌మెన్ పెద్దగా పరుగులు చేయలేకపోయారు. జానీ బెయిర్ స్టో 32 పరుగులతో టాప్ స్కోరర్ కాగా.. మయాంక్ అగర్వాల్ 25 పరుగులు చేశాడు. లక్నో బౌలర్లలో మోసిన్ ఖాన్ 3, కృనాల్ పాండ్యా, చమీర చెరో రెండు వికెట్లు తీశారు.
92 పరుగులకే ఐదు వికెట్లు.. కష్టాల్లో పంజాబ్
154 పరుగుల లక్ష్య చేధనతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ 92 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. బెయిర్ స్టో 21, రిషి ధవన్ క్రీజులో ఉన్నారు.
11 ఓవర్లలో పంజాబ్ కింగ్స్ 85/3
11 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ కింగ్స్ 3 వికెట్ల నష్టానికి 85 పరుగులు చేసింది. లివింగ్‌స్టోన్ 16, బెయిర్ స్టో 19 పరుగులతో ఆడుతున్నారు.
బానుక రాజపక్స(9) ఔట్.. మూడో వికెట్ కోల్పోయిన పంజాబ్
లక్నోతో మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ లక్ష్యచేధనలో తడబడుతుంది. 9 పరుగులు చేసిన బానుక రాజపక్స కృనాల్ పాండ్యా బౌలింగ్‌లో షాట్‌కు యత్నించి కేఎల్ రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అంతకముందు రవి బిష్ణోయి బౌలింగ్‌లొ 5 పరుగులు చేసిన ధావన్ క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. ప్రస్తుతం పంజాబ్ 3 వికెట్ల నష్టానికి 60 పరుగులు చేసింది.
మయాంక్ అగర్వాల్(25)ఔట్.. తొలి వికెట్ కోల్పోయిన పంజాబ్
154 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ మయాంక్ అగర్వాల్(25) రూపంలో తొలి వికెట్ కోల్పోయింది. చమీర బౌలింగ్‌లో కేఎల్ రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి మయాంక్ వెనుదిరిగాడు. ప్రస్తుతం పంజాబ్ 5 ఓవర్లలో వికెట్ నష్టానికి 36 పరుగులు చేసింది.
లక్నో సూపర్ జెయింట్స్ 153/8.. పంజాబ్ టార్గెట్ 154
పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో లక్నో సూపర్‌జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. డికాక్ 46 పరుగులతో టాప్ స్కోరర్ కాగా.. దీపక్ హుడా 34 పరుగులు చేశాడు. చివర్లో దుశ్మంత చమీర రెండు సిక్సర్లతో 17 పరుగులు చేసి ఔటయ్యాడు. పంజాబ్ కింగ్స్ బౌలర్లలో రబాడ 4, రాహుల్ చహర్ 2, సందీప్ శర్మ ఒక వికెట్ తీశాడు.
17 ఓవర్లలో లక్నో సూపర్ జెయింట్స్ 118/6
17 ఓవర్లు ముగిసేసరికి లక్నో 6 వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది. జాసన్ హోల్డర్ 4, దుష్మంత చమీర 4 పరుగులతో ఆడుతున్నారు.
ఐదో వికెట్ డౌన్.. లక్నో సూపర్ జెయింట్స్ 109/5
ఆయుష్ బదోని(4) రూపంలో లక్నో సూపర్ జెయింట్స్ ఐదో వికెట్ కోల్పోయింది. రబాడ బౌలింగ్‌లో లివింగ్‌స్టోన్‌కు క్యాచ్ ఇచ్చి బదోని వెనుదిరిగాడు. ప్రస్తుతం లక్నో 5 వికెట్ల నష్టానికి 109 పరుగులు చేసింది.
నాలుగు వికెట్లు కోల్పోయిన లక్నో సూపర్ జెయింట్స్
పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతూ వస్తోంది. తొలుత కృనాల్ పాండ్యా సమన్వయంతో దీపక్ హుడా(34) రనౌట్ కాగా.. ఆ తర్వాత రబాడ బౌలింగ్‌లో కృనాల్ ధావన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం లక్నో 4 వికెట్ల నష్టానికి 109 పరుగులు చేసింది.
డికాక్(46) ఔట్.. రెండో వికెట్ కోల్పోయిన లక్నో సూపర్ జెయింట్స్
నిలకడగా ఆడుతున్న క్వింటన్ డికాక్(46) సందీప్ శర్మ బౌలింగ్‌లో కీపర్ జితేశ్ శర్మకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. పంజాబ్ ఆటగాళ్లు అప్పీల్ చేసినప్పటికి అంపైర్ ఔటివ్వలేదు. అయితే డికాక్ మాత్రం తాను ఔట్ అంటూ క్రీజును వీడాడు.
ప్రస్తుతం 13 ఓవర్లలో లక్నో సూపర్ జెయింట్స్ 2 వికెట్ల నష్టానికి 99 పరుగులు చేసింది. దీపక్ హుడా 34, కృనాల్ పాండ్యా 5 పరుగులతో ఆడుతున్నారు.
9 ఓవర్లలో లక్నో సూపర్ జెయింట్స్ 60/1
9 ఓవర్లు ముగిసేసరికి లక్నో సూపర్ జెయింట్స్ వికెట్ నష్టానికి 60 పరుగులు చేసింది. క్వింటన్ డికాక్ 30 పరుగులు, దీపక్ హుడా 14 పరుగులతో క్రీజులో ఉన్నారు.
తొలి వికెట్ కోల్పోయిన లక్నో సూపర్ జెయింట్స్
పంజాబ్‌తో మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ తొలి వికెట్ కోల్పోయింది. ఆరు పరుగులు చేసిన కేఎల్ రాహుల్ రబాడ బౌలింగ్‌లో జితేశ్ శర్మకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం లక్నో వికెట్ నష్టానికి 13 పరుగులు చేసింది.
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్ కింగ్స్
ఐపీఎల్-2022లో శుక్రవారం(ఏప్రిల్ 29) లక్నో సూపర్ జెయింట్స్‌తో పంజాబ్ కింగ్స్ తలపడుతుంది. టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ బౌలింగ్ ఎంచుకుంది. ఇరు జట్లు తమ చివరి మ్యాచ్‌ల్లో విజయాలు సాధించి మంచి ఊపు మీద ఉన్నాయి.
సీఎస్కేతో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ విజయం సాధించగా.. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ రెండోసారి గెలిచింది. బలాబలాల్లో ఇరుజట్లు సమానంగా ఉండడంతో ఆసక్తికర పోరు జరగడం ఖాయం. పంజాబ్ కింగ్స్‌కు ధావన్ ఫాం పెద్ద బలం కాగా.. అటు లక్నో సూపర్ జెయింట్స్‌కు కేఎల్ రాహుల్ సగం బలం అని చెప్పొచ్చు.
Related News By Category
Related News By Tags
-
సిరీస్ మొత్తంలో గర్వపడిన సందర్భం అదే: కేఎల్ రాహుల్
విశాఖ వేదికగా సౌతాఫ్రికాతో నిన్న (డిసెంబర్ 6) జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డేలో టీమిండియా అలవోకగా విజయం సాధించింది. తద్వారా 3 మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో భారత్ ఆల్‌రౌండ్...
-
ముఖం మాడ్చుకున్న కుల్దీప్!.. రోహిత్ ఇలా చేశావేంటి?
సౌతాఫ్రికాతో మూడో వన్డేలో భారత చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ అదరగొట్టాడు. విశాఖపట్నం వేదికగా నిర్ణయాత్మక మ్యాచ్‌లో నాలుగు వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. తద్వారా సౌతాఫ్రికా మీద ఏకంగా ఐదుసార్లు....
-
ఎట్టకేలకు టాస్ గెలిచిన టీమిండియా..
టీమిండియా ఎట్టకేలకు టాస్ గెలిచింది. సౌతాఫ్రికాతో మూడో వన్డే సందర్భంగా విశాఖపట్నంలో తమ దురదృష్టానికి స్వస్తి పలికింది. 21వ ప్రయత్నంలో వన్డేల్లో తొలిసారి టాస్ గెలిచి.. తొలుత బౌలింగ్ ఎంచుకుంది. అందుకే...
-
IND vs SA: ఈ హీరోని మర్చిపోతే ఎలా?.. కెప్టెన్‌గానూ సరైనోడు!
జట్టులో తమకంటూ ప్రత్యేక బ్యాటింగ్ స్థానం లేకపోయినా టీమిండియాకు నిస్వార్థమైన సేవలు అందిస్తున్న క్రికెటర్లలో కేఎల్ రాహుల్ ముందు వరుసలో ఉంటాడు. 2014లో ఓపెనర్‌గా భారత జట్టు తరఫున ప్రస్థానం మొదలుపెట్టిన...
-
సొంత తెలివితేటలు వద్దు.. చెబితే నీకు అర్ధం కావడం లేదా?
రాయ్‌పూర్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో 4 వికెట్ల తేడాతో టీమిండియా ఓటమి పాలైన సంగతి తెలిసిందే. 359 పరుగుల లక్ష్యాన్ని భారత బౌలర్లు కాపాడుకోలేకపోయారు. ముఖ్యంగా పేసర్ ప్రసిద్ద్ కృష్ణ దారుణ ప...


