
IPL 2022 Auction Dates Confirmed Says Reports: ఐపీఎల్ 2022 మెగా వేలానికి ముహూర్తం ఖరారైంది. వచ్చే నెల(ఫిబ్రవరి) 12, 13 తేదీల్లో వేలం నిర్వహించాలని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఇవాళ నిర్ణయించింది. వేలానికి బెంగళూరు నగరం వేదికగా కానుంది. ఈ మేరకు ఇవాళ జరిగిన ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్‌లో నిర్ణయించినట్లు వార్తలు వస్తున్నాయి.
ఈ మీటింగ్‌లో వేలంతో పాటు పలు కీలక అంశాలపై స్పష్టత వచ్చినట్లు సమాచారం. సంజీవ్ గోయెంకా ఆర్పీఎస్‌జీ గ్రూప్‌కు చెందిన లక్నో ఫ్రాంఛైజీ, సీవీసీ క్యాపిటల్‌కు చెందిన అహ్మదాబాద్ ఫ్రాంచైజీలకు ‘లెటర్ ఆఫ్ ఇంటెంట్’ను జారీ చేయాలని గవర్నింగ్ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. అలాగే షెడ్యూల్, వేదికల ఖరారు అంశం కూడా ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు లీగ్ టైటిల్ స్పాన్సర్ షిప్ నుంచి వివో తప్పుకోవడంతో టాటా ఆ హక్కులకు చేజిక్కించుకుంది.
చదవండి: IND Vs SA 3rd Test: ద్రవిడ్ రికార్డ్ బద్దలు కొట్టిన కోహ్లి