IPL 2021 2nd Phase SRH Vs DC: ఎస్‌ఆర్‌హెచ్‌పై 8 వికెట్ల తేడాతో ఢిల్లీ ఘనవిజయం

IPL 2021: SRH VS Delhi Capitals Match Live Updates And Highlights - Sakshi

8 వికెట్ల తేడాతో ఢిల్లీ ఘనవిజయం..
దుబాయ్‌ వేదికగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఎస్‌ఆర్‌హెచ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 134 పరుగులకే పరిమితమైంది. ఢిల్లీ  బౌలర్లో రబడా 3 వికెట్లు పడగొట్టగా,  నోర్ట్జే,అక్షర్‌ పటేల్‌ చెరో రెండు వికెట్లు సాధించారు. ఆనంతరం 135 పరుగుల స్వల్ప లక్ష్య చేధనతో బరిలోకి దిగిన ఢిల్లీ  ఆదిలోనే ఓపెనర్‌ పృథ్వీషా(11) వికెట్‌ కోల్పోయింది.

.ఆ తర్వాత  మరో ఓపెనర్‌ శిఖర్ ధావన్, శ్రేయాస్ అయ్యర్ కలిసి రెండో వికెట్‌కి 52 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.. 37 బంతుల్లో 6 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 42 పరుగులు శిఖర్ ధావన్ రషీద్ ఖాన్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన  రిషబ్ పంత్, శ్రేయాస్‌తో కలిసి లక్ష్యాన్ని సూనాయసంగా చేధించారు. పంత్ (35) పరుగులు చేయగా, శ్రేయాస్ అయ్యర్ ( 47) పరుగులు చేశాడు. ఈ విజయంతో ఢిల్లీ క్యాపిటల్స్‌ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది.

రెండో వికెట్‌ కోల్పోయిన ఢిల్లీ.. ధావన్‌ ఔట్‌
71 పరుగుల వద్ద ఢిల్లీ రెండో వికెట్‌ కోల్పోయింది. మంచి ఊపు మీద ఉన్న ధావన్‌(42) రషీద్‌ ఖాన్‌ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి సమద్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. ప్రస్తుతం ఢిల్లీ 12 ఓవర్లో 2 వికెట్ల నష్టానికి 80 పరుగులు చేసింది. శ్రేయాస్‌ అయ్యర్‌(23), పంత్‌(5) క్రీజులో ఉన్నారు. 

నిలకడగా ఆడుతున్న ఢిల్లీ..
135 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌  నిలకడగా ఆడుతుంది. ప్రస్తుతం ఢిల్లీ 8 ఓవర్లలో ఒక వికెట్‌ నష్టానికి 51  పరుగులు చేసింది. ప్రస్తుతం  ధావన్‌(30), శ్రేయాస్‌ అయ్యర్‌(8) పరుగులతో క్రీజులో ఉన్నారు. 

తొలి వికెట్‌ కోల్పోయిన ఢిల్లీ.. పృద్వీషా(11) ఔట్‌
135 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన 20 పరుగుల వద్ద తొలి వికెట్‌ కోల్పోయింది. ఖలీల్‌ అహ్మద్‌ బౌలింగ్‌లో పృథ్వీషా(11) విలియమ్సన్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు.  ప్రస్తుతం ఢిల్లీ స్కోర్‌ 20/1. ధావన్‌ 9, శ్రేయాస్‌ అయ్యర్‌ 2 పరుగులతో క్రీజులో ఉన్నారు. 

20 ఓవర్లలో ఎస్‌ఆర్‌హెచ్‌ స్కోరు 134/9
►  ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌  నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ దిగిన ఎస్‌ఆర్‌హెచ్‌ ఆదిలోనే ఓపెనర్‌ డెవిడ్‌ వార్నర్‌ డకౌట్‌గా వెనుదిరిగాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్‌ విలియమ్సన్‌ మరో ఓపెనర్‌ వృద్దిమాన్‌ షాతో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. అయితే రెండుసార్లు ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న విలియమ్సన్‌ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్‌మన్‌ కూడా పెద్దగా ఆకట్టుకోలేదు.  చివర్లో అబ్దుల్‌ సమద్‌ 28 పరుగులు.. రషీద్‌ ఖాన్‌ 22 పరుగులు చేయడంతో ఎస్‌ఆర్‌హెచ్‌ 130 పరుగుల మార్క్‌ను దాటగలిగింది. ఢిల్లీ క్యాపిటల్స్‌ బౌలర్లలో రబడ 3, అక్షర్‌ పటేల్‌, నోర్ట్జే చెరో రెండు వికెట్లు తీశారు.

ఆరో వికెట్‌ కోల్పోయిన ఎస్‌ఆర్‌హెచ్‌.. జేసన్‌ హోల్డర్‌(10) ఔట్‌
►  ఢిల్లీ బౌలర్ల ధాటికి వరుస క్రమంలో  ఎస్‌ఆర్‌హెచ్‌ బ్యాట్స్‌మన్‌లు పెవిలియన్‌కు క్యూ కడతున్నారు.  అక్షర్‌ పటేల్‌ బౌలింగ్‌లో జేసన్‌ హోల్డర్‌(10) పృద్వీషాకు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. అంతకముందు నోర్ట్జే బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూ రూపంలో కేదార్‌ జాదవ్‌(3) వెనుదిరిగాడు. ప్రస్తుతం ఎస్‌ఆర్‌హెచ్‌ 16 ఓవర్లలో 6వికెట్ల నష్టానికి 97 పరుగులు చేసింది.

వరుసగా రెండు వికెట్లు కోల్పోయిన ఎస్‌ఆర్‌హెచ్‌‌.. 11 ఓవర్లలో 65/4
► ఎస్‌ఆర్‌హెచ్‌ వరుస ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయింది. రబడ వేసిన ఇన్నింగ్స్‌ 11వ ఓవర్‌ తొలి బంతికి మనీష్‌ పాండే (17) కాట్‌ అండ్‌ బౌల్డ్‌గా వెనుదిరిగాడు. ప్రస్తుతం ఎస్‌ఆర్‌హెచ్‌ 11 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 65 పరుగులు చేసింది. అంతకముందు కెప్టెన్‌ విలియమ్సన్‌ రూపంలో మూడో వికెట్‌ కోల్పోయింది. 18 పరుగులు చేసిన విలియమ్సన్‌ అక్షర్‌ పటేల్‌ బౌలింగ్‌లో హెట్‌మైర్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. అ‍ప్పటికే అశ్విన్‌ బౌలింగ్‌లో ఒకసారి.. అక్షర్‌ బౌలింగ్‌లో మరోసారి ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఈ అవకాశాలను విలియమ్సన్‌ అందిపుచ్చుకోలేకపోయాడు. 

రెండో వికెట్‌ కోల్పోయిన ఎస్‌ఆర్‌హెచ్‌
► వృద్ధిమాన్‌ సాహా రూపంలో ఎస్‌ఆర్‌హెచ్‌ రెండో వికెట్‌ను కోల్పోయింది. రబడ వేసిన ఇన్నింగ్స్‌ 5వ ఓవర్‌ చివరి బంతికి 18 పరుగులు చేసిన సాహా ధావన్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. అంతకముందు తొలి బంతిని సిక్స్‌ బాదిన సాహా.. ఆ తరువాతి నాలుగు బంతుల్లో ఒక్క పరుగు కూడా తీయలేకపోయాడు. కాగా రబడ తన ఓవర్‌ నాలుగు, ఐదు, ఆరో బంతి గంటకు 143 కిమీ వేగంతో వేయడం విశేషం. ప్రస్తుతం ఎస్‌ఆర్‌హెచ్‌ 8.1 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 45 పరుగులు చేసింది. విలియమ్సన్‌ 11, మనీష్‌ పాండే 10 పరుగులతో క్రీజులో ఉన్నారు. 

4 ఓవర్లలో ఎస్‌ఆర్‌హెచ్‌ స్కోరు ఎంతంటే..
► 4 ఓవర్లలో ఎస్‌ఆర్‌హెచ్‌ వికెట్‌ నష్టానికి 23 పరుగులు చేసింది. ఆరంభంలోనే వార్నర్‌ డకౌట్‌గా వెనుదిరగ్గా.. మరో ఓపెనర్‌ సాహాతో కలిసి కెప్టెన్‌ విలియమ్సన్‌ ఆచితూచి ఆడుతున్నారు. ప్రస్తుతం సాహా 12, విలియమ్సన్‌ 6 పరుగులతో ఆడుతున్నారు.

                                            Photo Courtesy: IPL.COM

డేవిడ్‌ వార్నర్‌ డకౌట్‌.. తొలి వికెట్‌ డౌన్‌
► ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌ను సన్‌రైజర్స్‌ ఫేలవంగా ఆరంభించింది. తొలి ఓవర్‌ మూడో బంతికే ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ డకౌట్‌గా వెనుదిరిగాడు. నోర్ట్జే బౌలింగ్‌లో అక్షర్‌ పటేల్‌కు సింపుల్‌ క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో పరుగుల ఖాతా తెరవకుండానే ఎస్‌ఆర్‌హెచ్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. ప్రస్తుతం ఎస్‌ఆర్‌హెచ్‌ వికెట్‌ నష్టానికి 6 పరుగులు చేసింది.

                                                 Photo Courtesy: IPL.COM

దుబాయ్‌: ఐపీఎల్‌-2021 సీజన్‌ రెండో అంచెలో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. ఆఖరి స్థానంలో ఉన్న సన్‌రైజర్స్‌, రెండో స్థానంలో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్‌ మధ్య మ్యాచ్‌ జరగనుంది. టాస్‌ గెలిచిన ఎస్‌ఆర్‌హెచ్‌ బ్యాటింగ్‌ ఎంచుకుంది. కోవిడ్‌ కారణంగా వాయిదా పడే నాటికి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్‌, పేలవ ప్రదర్శనతో ఆఖరిస్థానంలో సన్‌రైజర్స్‌ ఉంది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల ముఖాముఖి పోరు, బలాలు, బలహీనతలు.. తాజా మ్యాచ్‌లో గెలుపు అవకాశాలను పరిశీలిద్దాం.

ఇక ఐపీఎల్‌ తాజా సీజన్‌ తొలి అంచెలో చెన్నైలో జరిగిన ఢిల్లీ- హైదరాబాద్‌ మ్యాచ్‌ టై కావడంతో.. సూపర్‌ ఓవర్‌ నిర్వహించగా పంత్‌ సేనకు గెలుపు దక్కింది. గతంలో సన్‌రైజర్స్‌ మెరుగైన రికార్డే కలిగి ఉన్నప్పటికీ.. ఇప్పుడు మాత్రం పంత్‌ సేనదే పైచేయిగా కనిపిస్తోంది. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు ఆడిన 8 మ్యాచ్‌లలో ఢిల్లీ ఆరింటిలో గెలుపొంది పటిష్ట స్థితిలో ఉండగా... హైదరాబాద్‌ ఆడిన 7 మ్యాచ్‌లలో కేవలం ఒక్కటి మాత్రమే గెలిచింది. కాబట్టి ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌ జట్టుగా ఢిల్లీ బరిలోకి దిగనుంది.

ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌- ఢిల్లీ క్యాపిటల్స్‌ 19 సార్లు ముఖాముఖి తలపడ్డాయి. ఇందులో 11 సార్లు హైదరాబాద్‌నే విజయం వరించింది. ఢిల్లీ ఎనిమిది సార్లు గెలుపొందింది. అంతేకాదు, యూఏఈ వేదికగా జరిగిన గత సీజన్‌ గ్రూపు స్టేజ్‌లో కూడా ఎస్‌ఆర్‌హెచ్‌దే పైచేయిగా నిలిచింది. కానీ, కీలకమైన క్వాలిఫైయర్‌-2 ప్లే ఆఫ్స్‌లో మాత్రం ఢిల్లీ గెలిచి ఫైనల్‌ చేరి సత్తా చాటింది. 

ఢిల్లీ క్యాపిటల్స్‌:
రిషభ్‌ పంత్‌(కెప్టెన్‌, వికెట్‌ కీపర్‌), పృథ్వీ షా, శిఖర్‌ ధావన్‌, శ్రేయస్‌ అయ్యర్‌, హెట్‌మెయిర్‌, మార్కస్‌ స్టొయినిస్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, అక్షర్‌ పటేల్‌, కగిసొ రబడ, అన్రిచ్‌ నోర్ట్జే, ఆవేశ్‌ ఖాన్‌

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌:
డేవిడ్‌ వార్నర్‌, కేన్‌ విలియమ్సన్‌(కెప్టెన్‌), వృద్ధిమాన్‌ సాహా, మనీశ్‌పాండే, కేదార్‌ జాదవ్‌, జేసన్‌ హోల్డర్‌, అబ్దుల్‌ సమద్‌, రషీద్‌ ఖాన్‌, భువనేశ్వర్‌ కుమార్‌, సందీప్‌ శర్మ, ఖలీల్‌ అహ్మద్‌.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top