కాస్కోండి.. మిమ్ముల్ని చితక్కొట్టడానికి వస్తున్నాడు!

IPL 2021: MS Dhoni Turns Up The Heat In Nets - Sakshi

ముంబై: గత ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఏడో స్థానానికి పరిమితం కావడంతో ఆ జట్టులో పస అయిపోయిదంటూ విమర్శలు వినిపించాయి.  ఈ సీజన్‌ ఆరంభానికి ముందు కూడా ‘సీనియర్‌ సిటిజన్‌ అంటూ వ్యంగ్యాస్త్రాలు మొదలయ్యాయి. ఐపీఎల్‌-14 సీజన్‌లో కూడా గత జట్టుతోనే సీఎస్‌కే బరిలోకి దిగడమే అందుకు కారణం కావొచ్చు.  అయితే సూపర్‌ కింగ్స్‌కు కర్త, కర్మ, క్రియగా సర్వం తానే అయి నడిపించే ధోని ఉండగా ఏదీ అసాధ్యం కాదని ఆ జట్టు నమ్ముతోంది.   అందుకు తగ్గట్టుగానే ధోని అందరికంటే ముందుగానే ఐపీఎల్‌ ప్రాక్టీస్‌ ప్రారంభించాడు. వరుసగా ధోని ప్రాక్టీస్‌ చేస్తున్న వీడియోలను చూస్తే ఫుల్‌ రిథమ్‌లో కనిపిస్తున్నాడు.

భారీ షాట్లు కొట్టడంలో  సిద్ధహస్తుడైన ధోని.. ఈసారి మాత్రం తన పవర్‌ ఏమిటో మళ్లీ చూపించాలనే ఉద్దేశమే అతని ప్రాక్టీస్‌లో కనిపిస్తోంది. ఇదే విషయాన్ని సీఎస్‌కే కూడా తాజాగా స్సష్టం చేసింది.  బౌలర్లు.. మిమ్ముల్ని చితక్కొట్టడానికి తలా పరాక్‌ ఫుల్లీ లోడెడ్‌గా వస్తున్నాడు..విజిల్‌పోడు’ అంటూ ప్రత్యర్థి జట్లకు వార్నింగ్‌ కూడా ఇచ్చేసింది.  దీనికి సంబంధించిన వీడియోను సీఎస్‌కే ఫ్రాంచైజీ ఇన్‌స్టాలోషేర్‌ చేసింది. సీఎస్‌కే ఫ్యాన్స్‌ను అలరించే  ఈ వీడియోలో కొన్ని ధోని మార్కు  షాట్లు ఉన్నాయి. వన్‌ హ్యాండెడ్‌ షాట్‌ కూడా ఇందులో ఉంది.  

గత ఐపీఎల్‌ సీజన్‌లో సీఎస్‌కే జట్టు తరఫున సురేశ్‌ రైనా ఆడకపోవడం కూడా ప్రభావం చూపించింది. కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల యూఏఈ నుంచి రైనా ఉన్నపళంగా స్వదేశానికి వచ్చేశాడు. దానిపై అప్పట్లో  పెద్ద విమర్శలే వచ్చాయి. అసలు రైనా భవితవ్యం ఏమిటి అని ప్రశ్న తలెత్తింది.  అప్పుడు అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పిన రైనా.. సీఎస్‌కే జట్టును వీడి రావడంపై అనేక అనుమానాలు  వచ్చాయి. కానీ ఈసారి రైనా తిరిగి సీఎస్‌కే ఆడుతుండటంతో గత సీజన్‌ ఘటనకు ఫుల్‌స్టాప్‌ పడింది. ఇప్పుడు రైనా రాకతో సీఎస్‌కే మంచి జోష్‌లోనే ఉంది.  ఐపీఎల్‌ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో రైనా రెండో స్థానంలో  ఉన్నాడు. ఐపీఎల్‌లో  5,368 పరుగులు సాధించాడు. 

ఇక్కడ చదవండి:  IPL 2021: వాంఖడేలో మ్యాచ్‌లపై ఎంసీఏ స్పష్టత

ఆర్సీబీ నా మాట వినండి.. ఏబీని అలా చేయవద్దు!

 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top