అతను ఔటయ్యాక దూరంగా ఉంటా: మోర్గాన్‌ | IPL 2021:  I Tend To Stay Away From Andre After He Is Got Out, Morgan | Sakshi
Sakshi News home page

అతను ఔటయ్యాక దూరంగా ఉంటా: మోర్గాన్‌

Apr 22 2021 7:57 AM | Updated on Apr 22 2021 2:57 PM

IPL 2021:  I Tend To Stay Away From Andre After He Is Got Out, Morgan - Sakshi

ముంబై: సీఎస్‌కేతో జరిగిన మ్యాచ్‌లో ఓడిపోయినా తాము కడవరకూ పోరాడిన తీరుపై కేకేఆర్‌ కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ హర్షం వ్యక్తం చేశాడు. ఈ మ్యాచ్‌ను చూస్తున్నంతసేపు నరాలు తెగిపోయేంత ఉత్కంఠ కల్గిందన్న మోర్గాన్‌..  క్రికెట్‌ గేమ్‌ అంటే ఇది కదా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఒక రకంగా చూస్తే పవర్‌ ప్లేలో తాము ఆడిన తీరు చూసి ఓటమిని ముందే ఫిక్స్‌ అయ్యామని, అసలు గెలుపు అంచుల వరకూ వస్తామని కూడా అనుకోలేదన్నాడు. ఇంత దగ్గరగా వచ్చి ఓ‍డిపోవడం ఒకింత నిరాశ కల్గించిందన్నాడు.

ప్రధానంగా ఆండ్రీ రసెల్‌, దినేశ్‌ కార్తీక్‌ల భాగస్వామ్యం చూసిన తర్వాత ఆశలు చిగురించాయన్నాడు. బ్యాటింగ్‌కు స్వర్గధామంలా ఉన్న  ఈ పిచ్‌పై బ్యాట్స్‌మన్‌ ఒకసారి కుదురుకున్నాక ఆపడం కష్టమన్నాడు. వారిద్దరి భాగస్వామ్యం తర్వాత ప్యాట్‌ కమిన్స్‌ ఆడిన తీరు అద్భుతమన్నాడు. కమిన్స్‌ ఉన్నంతవరకూ తమకు గెలిచే చాన్స్‌ ఉందన్నాడు. మిడిల్‌, లోయర్‌ ఆర్డర్‌లో తమ బ్యాటర్స్‌ పోరాటం అద్వితీయమని మోర్గాన్‌ తెలిపాడు. తొలి ఐదు ఓవర్లు తమ బ్యాటింగ్‌ బాలేకపోవడమే ఓటమి కారణమన్నాడు. 

ఈ కొత్త గ్రౌండ్‌ పరిస్థితి, భిన్నమైన సవాళ్లు అర్థమైనందుకు సంతోషంగా ఉందన్నాడు. తమ బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకోవడంతో  తమ ముందు భారీ లక్ష్యంం నిర్దేశించారని, అదే తమ కొంపముంచిందన్నాడు. ఇక రసెల్‌ గురించి మాట్లాడిన మోర్గాన్‌..   అతను ఫామ్‌లోకి రావడం సంతోషంగా ఉందన్నాడు. అతను బంతిని హిట్‌ చేసిన విధానం చాలా బాగుందన్నాడు. కచ్చితంగా రసెల్‌ మంచి ఆటగాడన్నాడు. తాను రసెల్‌ ఔటైన తర్వాత అతనికి దూరంగా ఉంటానన్న మోర్గాన్‌.. తమ నుంచి అతనికి ఎటువంటి సహకారం అందించలేకపోయమన్నాడు. అది రసెల్‌ను తప్పకుండా నిరాశకు గురి చేస్తుందన్నాడు. 

చదవండి: ఎంఎస్‌ ధోని లెక్క తప్పిందా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement