బ్యాటింగ్‌లో సత్తా చాటేనా! | Indias second T20 against Ireland today | Sakshi
Sakshi News home page

బ్యాటింగ్‌లో సత్తా చాటేనా!

Jun 28 2026 12:48 AM | Updated on Jun 28 2026 12:48 AM

Indias second T20 against Ireland today

నేడు ఐర్లాండ్‌తో భారత్‌ రెండో టి20

బెల్‌ఫాస్ట్‌: టి20 ప్రపంచ చాంపియన్లుగా బరిలోకి దిగిన భారత జట్టుకు గత మ్యాచ్‌లో అనూహ్య ఓటమి ఎదురైంది. బలహీన జట్లలో ఒకటైన ఐర్లాండ్‌ సమష్టి ప్రదర్శనతో టీమిండియాపై తమ తొలి విజయాన్ని నమోదు చేసింది. అయితే ఈ పరాజయం చాలా అరుదైనదిగా చూపిస్తూ ఓటమిని ఒక్క మ్యాచ్‌కే పరిమితం చేయాల్సిన బాధ్యత భారత్‌పై ఉంది. ఇందు కోసం టీమిండియా ఏం చేస్తుందనేది ఆసక్తికరం. 

అతి బలమైన బ్యాటింగ్‌ లైనప్‌లో ఒక్క అభిషేక్‌ శర్మ మినహా మిగతావారంతా విఫలమయ్యారు. సామ్సన్, ఇషాన్‌ కిషన్, తిలక్‌వర్మ అంచనాలకు అనుగుణంగా రాణించాల్సి ఉంది. ఐపీఎల్‌లో సారథిగా చెలరేగిన శ్రేయస్‌ భారత కెప్టెన్ గా తొలి మ్యాచ్‌ను ఓటమితో మొదలు పెట్టాడు. ఇప్పుడు తాను బ్యాటింగ్‌లో సత్తా చాటడంతో పాటు నాయకుడిగా కూడా జట్టును గెలిపించాల్సిన బాధ్యత ఉంది. 

గత మ్యాచ్‌లో ఓడినా ఇప్పటికిప్పుడు తుది జట్టులో అనూహ్య మార్పులు చేసే అవకాశం తక్కువ. కాబట్టి ఈ సారి కూడా వైభవ్‌ సూర్యవంశీ అరంగేట్రం చేయడం కష్టమే. పిచ్‌ను బట్టి చూస్తే స్పిన్‌ ఆల్‌రౌండర్‌ సుందర్‌కంటే పేస్‌ ఆల్‌రౌండర్‌ సూర్యాంశ్‌ షెడ్గేను ఆడించే అవకాశం కనిపిస్తున్నాయి. గత మ్యాచ్‌లో చెత్త ప్రదర్శనతో ప్రసి«ద్‌ను పక్కన పెడితే ప్రిన్స్‌కు చాన్స్‌ లభిస్తుంది. మరో వైపు తొలి మ్యాచ్‌ ఇచ్చిన ఉత్సాహంతో ఐర్లాండ్‌ జోరు మీదుంది. మరోసారి గత ప్రదర్శనను జట్టు పునరావృతం చేస్తుందా అనేది ఆసక్తికరం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement