సలీమా సారథ్యంలోనే... | Indian women hockey team in the Nations Cup | Sakshi
Sakshi News home page

సలీమా సారథ్యంలోనే...

Jun 3 2026 3:40 AM | Updated on Jun 3 2026 3:40 AM

Indian women hockey team in the Nations Cup

నేషన్స్‌ కప్‌ బరిలో భారత మహిళల హాకీ జట్టు

న్యూఢిల్లీ: ఎనిమిది దేశాలు పాల్గొనే నేషన్స్‌ కప్‌ హాకీ టోర్నమెంట్‌లో పాల్గొనే భారత మహిళల జట్టును మంగళవారం ప్రకటించారు. సలీమా టెటె నాయకత్వంలో పోటీ పడనున్న ఈ జట్టులో కొత్త ప్లేయర్లు లాల్‌తంత్‌లువాంగి, శిల్పి దబాస్‌లకు మరో అవకాశం దక్కింది. ఇటీవల ఆ్రస్టేలియాతో జరిగిన నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో కూడా లాల్‌తంగ్, శిల్పి జట్టులో భాగంగా ఉన్నా... ఒక్క మ్యాచ్‌లో కూడా బరిలోకి దిగలేదు. 

ఆ్రస్టేలియాతో సిరీస్‌ను 2–2తో సమం చేసుకున్న జట్టును నడిపించిన సలీమా కెప్టెన్‌గా కొనసాగనుండగా... సీనియర్లు సవిత, బిచ్చు దేవి గోల్‌కీపర్లుగా బాధ్యతలు నిర్వర్తిస్తారు. ‘అనుభవజు్ఞలు, జూనియర్ల ప్లేయర్లతో సమతూకంగా జట్టును ఎంపిక చేశాం. ఇటీవల అర్జెంటీనా, ఆస్ట్రేలియా పర్యటనలతో మన జట్టు ప్రదర్శన మరింత మెరుగైంది. నిలకడగా రాణిస్తున్న టీమ్‌ నేషన్స్‌ కప్‌ సవాల్‌కు సిద్ధంగా ఉంది’ అని హెడ్‌ కోచ్‌ జోయెర్డ్‌ మరీన్‌ వ్యాఖ్యానించాడు. 

నేషన్స్‌ కప్‌ గ్రూప్‌ ‘ఎ’లో భారత్‌తో పాటు జపాన్, అమెరికా, ఉరుగ్వే ఉండగా...గ్రూప్‌ ‘బి’లో న్యూజిలాండ్, కొరియా, ఫ్రాన్స్, చిలీ బరిలోకి దిగనున్నాయి. జూన్‌ 15 నుంచి 21 వరకు న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్‌లో ఈ టోర్నీ జరుగుతుంది. నేషన్స్‌ కప్‌ విజేత జట్టు తదుపరి సీజన్‌ ప్రొ లీగ్‌కు అర్హత సాధిస్తుంది.  

భారత జట్టు వివరాలు: సవిత, బిచ్చుదేవి (గోల్‌కీపర్లు); సుశీలా చాను, ఇషిక చౌధరీ, లాల్‌తంగ్‌లువాంగి, శిల్పి దబాస్, జ్యోతి, నిక్కీ ప్రధాన్‌ (డిఫెండర్లు); సలీమా టెటె, నేహ, సునేలిత టొప్పో, సాక్షి రాణా, దీపిక సొరెంగ్, సోనమ్, లాల్‌రెమ్‌సియామ్‌ (మిడ్‌ఫీల్డర్లు); నవనీత్‌ కౌర్, దీపిక, రుతుజా పిసాల్, ఇషిక, అన్ను (ఫార్వర్డ్స్‌).  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement