
PC: ISL
ISL 2021-2022: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో గురువారం హైదరాబాద్ ఎఫ్‌సీ, చెన్నైయిన్ ఎఫ్‌సీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ 1–1 స్కోరుతో డ్రా అయింది. మ్యాచ్ ఆరంభమైన 13 నిమిషాలకే చెన్నై ఆధిక్యంలోకి వెళ్లింది. డిఫెండర్ మొహమ్మద్ సాజిద్ ధోత్ గోల్ చేయడంతో 1–0తో పైచేయి సాధించింది. హైదరాబాద్ ఫార్వర్డ్ ఆటగాడు జేవియర్ సివేరియో (45వ ని.) గోల్ చేసి స్కోరును 1–1తో సమం చేశాడు.