
జొహోర్ (మలేసియా): సుల్తాన్ ఆఫ్ జొహోర్ కప్ అండర్–21 అంతర్జాతీయ జూనియర్ హాకీ టోర్నీలో భారత్ ఖాతాలో తొలి ‘డ్రా’ చేరింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో మంగళవారం జరిగిన మూడో లీగ్ మ్యాచ్‌ను భారత జట్టు 3–3 గోల్స్‌తో ‘డ్రా’గా ముగించింది. భారత్ తరఫున అరిజిత్ సింగ్ (43వ నిమిషంలో), ఆనంద్ (47వ నిమిషంలో), మన్‌మీత్ (53వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు.
పాకిస్తాన్ తరఫున హన్నాన్ షాహిద్ (5వ నిమిషంలో) ఒక గోల్.. సుఫియాన్ ఖాన్ (39వ, 55వ నిమిషంలో) రెండు గోల్స్ చేశాడు. ఆరు జట్లు పోటీపడుతున్న ఈ టోర్నీలో భారత్ ఏడు పాయింట్లతో ఆ్రస్టేలియాతో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో ఉంది.