
ఆసియాకప్-2025 తర్వాత టీమిండియా స్వదేశంలో వెస్టిండీస్‌తో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో తలపడనుంది. ఈ రెడ్ బాల్ క్రికెట్ సిరీస్ ఆక్టోబర్ 2 నుంచి 16 వరకు జరగనుంది. వెంటనే ఆక్టోబర్ 19 భారత్-ఇండియా వైట్ బాల్ సిరీస్ ప్రారంభం కానుంది. దీంతో రాబోయో రెండు నెలల పాటు భారత జట్టు వరుస సిరీస్‌లతో బీజీబీజీగా గడపనుంది.
కెప్టెన్‌గా రాహుల్..?
వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌కు మరో పది రోజుల్లో ప్రకటించే అవకాశముంది. అయితే ఈ సిరీస్‌లోని తొలి టెస్టుకు టీమిండియా రెగ్యూలర్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్‌కు దూరమయ్యే అవకాశముంది. గిల్ ప్రస్తుతం ఆసియా కప్ టోర్నీలో బిజీగా ఉన్నాడు. గ్రూపు-ఎలో ఉన్న భారత్ ఫైనల్‌కు చేరడం దాదాపు ఖాయమనే చెప్పుకోవాలి.
ఈ ఖండాంతర టోర్నీ ఫైనల్ సెప్టెంబర్ 28న జరగనుంది. అక్కడికి మూడు రోజుల్లో అంటే అక్టోబర్ 2 నుంచి వెస్టిండీస్‌తో తొలి టెస్టు మొదలు కానుంది. దీంతో మొదటి టెస్టుకు సెలక్టర్లు గిల్‌కు విశ్రాంతి ఇచ్చే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఇదే జరిగితే తొలి టెస్టులో భారత కెప్టెన్‌గా కేఎల్ రాహుల్ వ్యవహరించవచ్చు. రాహుల్ ఆసియాకప్ జట్టులో సభ్యునిగా లేని సంగతి తెలిసిందే.
ఓపెనర్లగా రాహుల్, జైశ్వాల్..
ఇక ఇంగ్లండ్ టూర్‌లో అద్బుతంగా రాణించిన యశస్వి జైశ్వాల్, కేఎల్ రాహుల్ ఓపెనర్లగా కొనసాగనున్నారు. అదేవిధంగా అభిమన్యు ఈశ్వరన్ మరోసారి రిజర్వ్ ఓపెనర్‌గా ఉంటాడు. సాయి సుదర్శన్, కరుణ్ నాయర్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్లగా ఎంపిక కానున్నారు. అయితే వీరిద్దరిలో ఒకరికే తుది జట్టులో చోటు దక్కే అవకాశముంది.
పంత్‌కు గాయం, జగదీశన్‌కు చోటు..
ఇక ఇంగ్లండ్ టూర్‌లో గాయపడ్డ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్.. విండీస్ సిరీస్‌కు దూరమయ్యే సూచనలు ఎక్కువగా కన్పిస్తున్నాయి. అతడి స్ధానంలో ధ్రువ్ జురెల్ మరోసారి వికెట్ల వెనక బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. అయితే తమిళనాడుకు చెందిన నారయణ్ జగదీశన్ సెకెండ్ వికెట్ కీపర్‌గా ఉండనున్నాడు.
అయ్యర్ ఎంట్రీ?
ఇక మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ తిరిగి భారత టెస్టు జట్టులోకి రానున్నట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. ఈ కారణంతోనే అతడిని ఆసీస్-ఎతో సిరీస్‌కు భారత-ఎ జట్టు కెప్టెన్‌గా అయ్యర్‌ను సెలక్టర్లు ఎంపిక చేశారు. శ్రేయస్‌కు భారత టెస్టు జట్టులో చోటు దక్కితే మరోసారి సర్ఫరాజ్ ఖాన్‌పై వేటు పడే అవకాశముంది.
ఇక ఆల్‌రౌండర్లగా రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్,నితీష్ కుమార్ రెడ్డి తమ స్దానాలను పదిలం చేసుకున్నారు. ఫాస్ట్ బౌలింగ్ విభాగంలో జస్ప్రీత్ బుమ్రా, ఆకాశ్ దీప్, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ చోటు దక్కించుకోనున్నారు. స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా కుల్దీప్ యాదవ్ కొనసాగనున్నాడు. అయితే ఆసియాకప్‌లో కెప్టెన్ గిల్‌తో భాగమైన బుమ్రా, కుల్దీప్ యాదవ్‌లు తొలి టెస్టుకు అందుబాటులో ఉంటారో లేదో వేచి చూడాలి.
వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌కు భారత జట్టు (అంచనా)
యశస్వీ జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్, ధృవ్ జురెల్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్, జస్ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్, నితీష్ కుమార్ రెడ్డి, ఎన్ జగదీశన్.
చదవండి: #Babar Azam: 6 లగ్జరీ కార్లు.. పాక్ రిచెస్ట్ క్రికెటర్‌గా! బాబర్ ఆజం నెట్ వర్త్ ఎంతంటే?