6 లగ్జరీ కార్లు.. పాక్‌ రిచెస్ట్ క్రికెటర్‌గా! బాబ‌ర్ ఆజం నెట్ వ‌ర్త్ ఎంతంటే? | Babar Azam Net Worth And Salary | Sakshi
Sakshi News home page

#Babar Azam: 6 లగ్జరీ కార్లు.. పాక్‌ రిచెస్ట్ క్రికెటర్‌గా! బాబ‌ర్ ఆజం నెట్ వ‌ర్త్ ఎంతంటే?

Sep 11 2025 6:48 PM | Updated on Sep 11 2025 7:35 PM

Babar Azam Net Worth And Salary

బాబ‌ర్ ఆజం.. పాకిస్తాన్‌కే కాకుండా ప్ర‌పంచంలోనే అత్యత్తుమ బ్యాటర్ల‌లో ఒక‌డిగా పేరుగాంచాడు. అరంగేట్రం చేసిన కొన్నాళ్ల‌కే మూడు ఫార్మాట్ల‌లోనూ పాక్ క్రికెట్ ముఖ చిత్రంగా మారాడు. త‌న కెప్టెన్సీతో పాటు అద్బుత బ్యాటింగ్‌తో పాటు జ‌ట్టును విజ‌య ప‌థంలో న‌డిపించిన ఘ‌న‌త అత‌డిది. 

క్లాసిక్ క‌వ‌ర్ డ్రైవ్ షాట్ల‌కు పెట్టింది పేరు. అత‌డి క్రీజులో ఉంటే ప్ర‌త్య‌ర్ధి బౌల‌ర్ల‌కు గుండెల్లో రైళ్లు ప‌రిగేత్తేవి. అయితే ఇదంతా ఒకప్పుడు.  గ‌త కొన్నేళ్ల‌గా అత‌డు బ్యాట్ ముగ‌బోయింది. అంత‌ర్జాతీయ క్రికెట్‌లో బాబ‌ర్ సెంచ‌రీ చేసి రెండేళ్ల‌పైనే అయిపోయింది.

ఒకనొక ద‌శలో టీమిండియా స్టార్ విరాట్ కోహ్లితో పోటిపోడిన బాబ‌ర్ ఆజం.. ఇప్పుడు ఏకంగా జ‌ట్టులోనే చోటు కోల్పోయాడు. ఆసియాక‌ప్‌-2025కు ఎంపిక చేసిన పాక్ జ‌ట్టులో బాబ‌ర్‌కు చోటు ద‌క్క‌లేదు. అతడి పేలవ ఫామ్ కారణంగా సెలక్టర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు.

అయితే బాబర్‌ను జట్టు నుంచి తప్పించినప్పటికి అతడి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ మాత్రం ఇసుమంత కూడా తగ్గలేదు. ఆజం తిరిగి సౌతాఫ్రికాతో జరిగే టెస్టు సిరీస్‌లో ఆడే అవకాశముంది. ఇక ఇది ఇలా ఉండగా.. అభిమానులు బాబర్‌ ఆజం నెట్‌వర్త్‌ ఎంతో తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. బాబర్‌కు ఏడాదికి ఎంతో సంపాదిస్తున్నాడో ఓ లుక్కేద్దాం.

బాబ‌ర్ ఆజం నెట్ వ‌ర్త్ ఎంతంటే?
పాకిస్తాన్‌లో అత్యంత రిచెస్ట్ క్రికెట‌ర్‌గా బాబ‌ర్ ఆజం కొన‌సాగుతున్నాడు. ప‌లు రిపోర్ట్‌లు ప్ర‌కారం.. 2024-25కు గానూ బాబ‌ర్ ఆజం నెట్ వ‌ర్త్ రూ. 41 కోట్ల‌గా ఉన్న‌ట్లు తెలుస్తోంది. బాబ‌ర్ మొన్న‌టివ‌ర‌కు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(PCB) ఏ గ్రేడ్‌ కాంట్రాక్ట్‌లో ఉన్నాడు. దీంతో అతడికి పీసీబీ నుంచి నెలకు పీకేఆర్‌ 4.5 మిలియన్లు(భారత కరెన్సీలో దాదాపు 13.95 లక్షలు) లభించేవి. 

అదేవిధంగా ఐసీసీ వాటా నుంచి పీకేర్‌ 2.07 మిలియన్లు బోనస్ రూపంలో బాబర్‌కు వచ్చేవి. అంటే మొత్తంగా ఏడాదికి జీతం రూపంలో ఆజంకు భార‌త క‌రెన్సీ ప్ర‌కారం రూ.2 కోట్ల పైగా అందేది. అదే విధంగా అతడి మ్యాచ్‌ ఫీజుల విషయానికి వస్తే.. ప్రతీ టెస్టు మ్యాచ్‌కు రూ. సుమారు 4 లక్షలు, వన్డేకు రూ. 2 లక్షలు, టీ20 మ్యాచ్‌కు రూ.1.5 లక్షలు తీసుకుంటాడు.

పీఎస్‌ఎల్ శాలరీ ఎంతంటే?
పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో పెషావర్ జల్మీకి ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. అతడు పెషావర్ నుంచి కాంట్రాక్ట్ రూపంలో ఏడాదికి రూ. 1.88 కోట్లు అందుకుంటాడు.

ఒక్కో యాడ్‌కు రూ.50 లక్షలు?
బాబర్‌ ప్రస్తుతం పలు ఇంటర్నేషనల్‌ బ్రాండ్స్‌కు అంబాసిడర్‌గా వ్యహహరిస్తున్నాడు. ఒక్కో యాడ్‌లో నటించినందుకు ఆజం రూ.50 లక్షలు అందుకున్నట్లు సమాచారం. పెప్సి, హెడ్ అండ్ షోల్డర్స్, హెబీఎల్‌ బ్యాండ్‌లను బాబర్‌ ప్రమోట్‌ చేస్తున్నాడు. ఆడి ఎ-5, బీఎమ్‌డ‌బ్ల్యూ, ఆడి ఇ-ట్రోన్, బ్లాక్ హ్యుందాయ్ సొనాటా,లంబోర్గిని అవెంటడోర్, BJ40 ప్లస్ జీప్ వంటి ఖ‌రీదైన కార్లు బాబ‌ర్ వ‌ద్ద ఉన్నాయి. అదే విధంగా బాబ‌ర్‌కు లాహోర్‌లో  విలాసవంత‌మైన ఓ  ఫామ్‌హౌస్‌ కూడా ఉంది. 

బాబ‌ర్‌కు డిమోష‌న్‌..
అయితే ఇటీవ‌ల 2025-26 ఏడాదికి గానూ సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాను ప్ర‌కటించిన పీసీబీ.. బాబ‌ర్ ఆజం, మ‌హ్మ‌ద్ రిజ్వాన్‌ల‌కు భారీ షాకిచ్చింది.  ఈ స్టార్ క్రికెట‌ర్ల‌కు డిమోష‌న్ ల‌భించింది. గ‌త కొన్ని సంవత్సరాలుగా కేటగిరీ ఎలో ఉన్న బాబ‌ర్‌, రిజ్వాన్‌లు ఇప్పుడు కేట‌గిరీ బికి ప‌డిపోయారు. దీంతో వీరికి నెలకు పీకేఆర్ 3 మిలియన్లు( భారత కరెన్సీ 9.28 లక్షలు) అందుకోనున్నారు. గతేడాదితో పోలిస్తే వారి జీతంలో దాదాపు నాలుగు లక్షలపైగా కోత పడింది.
చదవండి: Asia Cup 2025: టీమిండియాతో మ్యాచ్‌.. పాకిస్తాన్‌కు భారీ షాక్‌!?

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement