కోల్‌కతా వేదికగా భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న తొలి టెస్టు అరుదైన రికార్డుకు వేదికైంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఆరుగురు ఎడమ చేతి వాటం ప్లేయర్లతో బరిలోకి దిగింది. భారత టెస్టు క్రికెట్ చరిత్రలో ఒకే మ్యాచ్‌లో ఆరుగురు లెఫ్ట్ హ్యాండ్ ఆటగాళ్లు ఆడడం ఇదే తొలిసారి.
యశస్వి జైశ్వాల్, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, పంత్, కుల్దీప్ యాదవ్ వంటి ఆరుగురు ఎడమ చేతి వాటం ప్లేయర్లు ఉన్నారు. టాప్-8లో అయితే ఏకంగా లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లు ఏకంగా ఐదుగురు ఉండడం గమనార్హం.
అంతకముందు మూడు సందర్భాల్లో భారత్ ఐదుగురు లెఫ్ట్ హ్యాండర్లతో ఆడింది. కానీ ఆరు మంది ఆడడం ఇదే మొదటి సారి. అయితే హెడ్‌కోచ్ గౌతమ్ గంభీర్ తీసుకున్న ఈ నిర్ణయంపై మాజీ క్రికెటర్లు విమర్శలు కురిపిస్తున్నారు. ఆరుగురు అవసరమంటా అంటూ మండిపడుతున్నారు. అందులో నలుగురు స్పిన్నర్లే ఉన్నారు. ఈ మ్యాచ్‌లో కేవలం ఇద్దరు ఫాస్ట్ బౌలర్లతో మాత్రమే భారత్ ఆడుతోంది.
భారత్ అత్యధిక లెఫ్ట్ హ్యాండర్లతో ఆడిన టెస్టులు ఇవే..
6 vs సౌతాఫ్రికా-కోల్‌కతా 2025
5 vs ఇంగ్లండ్ - మాంచెస్టర్, 2025
5 vs వెస్టిండీస్- అహ్మదాబాద్, 2025
5 vs వెస్టిండీస్- ఢిల్లీ, 2025
సౌతాఫ్రికాతో తొలి టెస్టుకు భారత ప్లేయింగ్ ఎలెవన్
యశస్వి జైస్వాల్, కెఎల్ రాహుల్, వాషింగ్టన్ సుందర్, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్


