BCCI Announced Asia Cup 2023 Team India squad, KL Rahul And Iyer Will Make A Re-Entry - Sakshi
Sakshi News home page

Asia Cup 2023 Team India Squad: ఆసియాకప్‌కు భారత జట్టు ప్రకటన.. తిలక్‌ వర్మకు ఛాన్స్‌! స్టార్‌ ఆటగాళ్లు ఎంట్రీ

Aug 21 2023 1:29 PM | Updated on Aug 21 2023 2:02 PM

India Asia Cup 2023 squad announced - Sakshi

ఆసియాకప్‌-2023కు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఈ మెగా ఈవెంట్‌కు 17 మంది సభ్యలతో కూడిన జట్టును అజిత్‌ అగార్కర్‌ నేతృత్వంలోని సెలక్షన్‌ కమిటీ ఎంపిక చేసింది. గాయం కారణంగా జట్టుకు దూరంగా ఉంటున్న స్టార్‌ ఆటగాళ్లు కేఎల్‌ రాహుల్‌, అయ్యర్‌ ఆసియాకప్‌తో రీ ఎంట్రీ ఇవ్వనున్నారు. వీరిద్దరికి ఆసియాకప్‌ జట్టులో చోటు దక్కింది.

అదే విధంగా  ఈ జట్టులో హైదరాబాదీ, యువ ఆటగాడు తిలక్‌ వర్మకు కూడా చోటు దక్కింది. మరోవైపు వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ సంజూ శాంసన్‌కు ప్రధాన జట్టులో చోటు దక్కలేదు. అతడిని రిజర్వ్‌ ప్లేయర్‌గా సెలక్టర్లు ఎంపిక చేశారు. సోమవారం ఢిల్లీలో జరిగిన సెలక్షన్‌ కమిటీ సమావేశంలో ఈ జట్టును ఖారారు చేశారు. ఈ మీటింగ్‌లో టీమిండియా హెడ్‌కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌తో పాటు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ పాల్గోనున్నాడు.


                                                  PC: BCCI

ఇక ఈ ఏడాది ఆసియాకప్‌ శ్రీలంక, పాకిస్తాన్‌ల వేదికగా హైబ్రిడ్‌ మోడల్‌లలో జరగనుంది. ఆగస్టు 30న ముల్తాన్‌ వేదికగా పాకిస్తాన్‌ నేపాల్‌ మధ్య జరగనున్న మ్యాచ్‌తో ఈ టోర్నీ ప్రారంభం కానుంది. ఇక భారత్‌ తమ తొలి మ్యాచ్‌లో సెప్టెంబర్‌ 2న పల్లెకెలె వేదికగా దాయాది పాకిస్తాన్‌తో తలపడనుంది.

ఆసియాకప్‌ భారత జట్టు: రోహిత్‌ శర్మ(కెప్టెన్‌), శుబ్‌మన్‌ గిల్‌, విరాట్‌ కోహ్లి, శ్రేయస్‌ అయ్యర్‌, కేఎల్‌ రాహుల్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, తిలక్‌ వర్మ, ఇషాన్‌ కిషన్‌, హార్దిక్‌ పాండ్యా(వైస్‌ కెప్టెన్‌), రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌, శార్దూల్‌ ఠాకూర్‌, జస్‌ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ షమీ, మహ్మద్‌ సిరాజ్‌, కుల్దీప్‌ యాదవ్‌, ప్రసిద్‌ కృష్ణ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement